AP జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AP NHM Jobs | AP Contract Basis Jobs | AP Outsourcing Jobs 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుండి జాతీయ ఆరోగ్య మిషన్లో భాగమైన నేషనల్ ట్యూబర్క్యూలోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాం లో ఉన్న ఖాళీలు భర్తీకి అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది. 

నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను కాంట్రాక్టు లేదా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 

🏹 విజయవాడ సికింద్రాబాద్ రైల్వే డివిజన్స్ లో ఉద్యోగాలు భర్తీ – Click here 

✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

  • ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్ర వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుండి విడుదల చేయడం జరిగింది.

🔥 పోస్టుల పేర్లు: 

  • నేషనల్ ట్యూబర్క్యులసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాం లో ఖాళీగా ఉన్న మైక్రో బయాలజిస్ట్, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, నిక్షయ్ ఆపరేటర్ , ల్యాబ్ అటెండెంట్, ఫార్మసిస్ట్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 ఖాళీలు : 

  • నోటిఫికేషన్ ద్వారా మొత్తం పది పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
  • మైక్రో బయాలజిస్ట్ – 01
  • సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్స్ – 03 
  • ల్యాబ్ టెక్నీషియన్స్ – 03
  • నిక్షయ్ ఆపరేటర్ – 01
  • ల్యాబ్ అటెండెంట్ – 01
  • ఫార్మసిస్ట్ – 01

🔥 జీతము: 

  • మైక్రో బయాలజిస్ట్ – 50,000/-
  • సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్స్ – 25,830/- 
  • ల్యాబ్ టెక్నీషియన్స్ – 23,393/-
  • నిక్షయ్ ఆపరేటర్ – 18,430/-
  • ల్యాబ్ అటెండెంట్ – 15,000/-
  • ఫార్మసిస్ట్ – 23,393/-

🔥 పోస్టింగ్ ప్రదేశం : 

  • ఫార్మసిస్ట్ ఉద్యోగానికి ఎంపికైన వారికి విశాఖపట్నంలో ఉన్న స్టేట్ డ్రగ్ స్టోర్ లో పోస్టింగ్ ఇస్తారు. 
  • మిగతా అన్ని రకాల ఉద్యోగాలకు ఎంపికైన వారికి తిరుపతిలో ఉన్న C&DST లో పోస్టింగ్ ఇస్తారు. 

🔥 అప్లికేషన్ తేదీలు : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు 16-12-2024 నుండి అప్లై చేయవచ్చు.
  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 06-01-2025

🔥 విద్యార్హత : 

  • పోస్టులను అనుసరించి 10+2 , D. ఫార్మసీ / B. ఫార్మసీ, DMLT మరియు సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు కలిగి ఉండాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • జనరల్ అభ్యర్థులు 1000/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు అభ్యర్థులు 500/- ఫీజు చెల్లించాలి. 
  • Joint Director, TB and State TB Officer, Andhra Pradesh (Payable at Vijayawada) అనే పేరు మీద చెల్లుబాటు అయ్యే విధంగా ఫీజు చెల్లించాలి.

🔥 వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

🔥 వయసులో సడలింపు : 

  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయసులో సడలింపు కూడా వర్తిస్తుంది. 
  • అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
  • విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాల వరకు వయసులో సడలింపు వర్తిస్తుంది.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
  • మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • అభ్యర్థులకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా 70 మార్కుల వరకు కేటాయిస్తారు.
  • అభ్యర్థులకు ఉన్న అనుభవానికి 20 మార్కుల వరకు కేటాయిస్తారు
  • మరియు ఉద్యోగానికి అప్లై చేయడానికి అవసరమైన అర్హత కోర్సు పూర్తి చేసినప్పటి నుండి ఇప్పటివరకు పూర్తయిన సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి ఒక మార్క్ కేటాయిస్తూ గరిష్టంగా 10 మార్కులు కేటాయిస్తారు. 

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా  : 

  • అభ్యర్థులు తమ అప్లికేషన్ తో పాటు అప్లికేషన్ ఫీజు చెల్లించిన డిడిని మరియు సంబంధిత సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ కాపీలను జతపరిచి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు లేదా స్వయంగా వెళ్లి అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు .
  • అప్లికేషన్ పంపించాల్సిన అడ్రస్ – O/o Joint Director (TB), 5th Floor, APIIC Building, Mangalagiri, Guntur – 522503

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి. 

🔥 ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. 

✅ Download Notification – Click here 

✅  Download Application – Click here 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!