AP ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ | AP Inter Advanced Suplementary Exam Dates | AP Inter Recounting, Re Verification Dates

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షలు రాసిన వారికి ముఖ్యమైన సమాచారం వచ్చింది. ఇంటర్ పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షల కోసం ఈనెల 18 నుండి 24వ తేదీ వరకు ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి సౌరబ్ గౌర్ ప్రకటన చేశారు. 

దీంతోపాటు రీ వెరిఫికేషన్ , రీకౌంటింగ్ చేసుకోవడానికి కూడా విద్యార్థులు ఇదే తేదీల్లో ఫీజు చెల్లించాలని వెల్లడించారు.  పూర్తి వివరాలు కోసం విద్యార్థులు తమ కళాశాలలో సంప్రదించి ఫీజు చెల్లించవచ్చు.

మార్చి 1వ నుండి మార్చి 20వ తేదీ మధ్య ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 5,17,617 మంది విద్యార్థులు మరియు ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,36,056 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. 

అనగా సంవత్సరాలకు కలిపి 1,053,673 మంది పరీక్ష ఫీజు చెల్లించగా వారిలో 9,99,698 పరీక్షలు రాశారు. పరీక్ష జవాబు పత్రాలను ఏప్రిల్ 4వ తేదీ వరకు మూల్యాంకనం చేశారు. దాదాపుగా 23 వేల మందితో ఈ మూల్యంకనం పూర్తి చేశారు. ఇటీవల వీటికి సంబంధించిన ఫలితాలు విడుదల చేశారు. 2nd Year లో 78% , 1st Year లో 67% పాస్ అయ్యారు. రెండు సంవత్సరాల్లో కూడా అమ్మాయిలే ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు.

సప్లిమెంటరీ పరీక్షలను మే 25 నుండి జూన్ 1 తేదీలు నిర్మిస్తామని బోర్డ్ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 18 నుండి 24 తేదీలు మధ్య ఫీజు చెల్లించాలి.

అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, రీకౌంటింగ్ , రీ వెరిఫికేషన్ ఫీజులు వివరాలు : 

రీకౌంటింగ్ కు అప్లై చేయాలి అనుకున్న విద్యార్థులు ఒక్కో పేపర్ కు 260/- రూపాయలు, రీ వెరిఫికేషన్ కు అప్లై చేయాలి అనుకున్న విద్యార్థులు ఒక్కొక్క పేపర్ కు 1300/- రూపాయలు చెల్లించాలని చెప్పారు. 

ఇక సప్లమెంటరీ పరీక్షల కోసం ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సరం విద్యార్థులు పేపర్లతో సంబంధం లేకుండా 550/- రూపాయలు , ప్రాక్టికల్స్ కు 250/- రూపాయలు , బ్రిడ్జి కోర్సులకు 150/- రూపాయలు చొప్పున ఫీజు చెల్లించాలని తెలిపారు.

  • ఇంటర్ మొదటి సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ కోసం 550/- రూపాయలు పరీక్ష ఫీజు తో పాటుగా పేపర్ కు 160/- రూపాయలు చొప్పున చెల్లించాలి.
  • మొదటి మరియు రెండో సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాయాలి అనుకుంటే సైన్స్ విద్యార్థులు 1440/- రూపాయలు , ఆర్ట్స్ విద్యార్థులు 1240/- చెల్లించాలి.

🔥 పరీక్ష తేదీలు : మే 25వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. 

ఇంటర్మీడియట్ ఫలితాలను చెక్ చేసుకునేందుకు అధికారిక వెబ్సైట్ ఇదే 👇👇👇

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *