ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఇందులో భాగంగా డిజిటల్ లక్ష్మి పథకం అనే కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఇప్పటికే ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తుంది. పింఛన్లు పెంపు, దీపం పథకం, తల్లికి వందనం ఇంటి పథకానికి ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఈ నెలలో అన్నదాత సుఖీభవ పథకం నిధులు అర్హత ఉన్న రైతుల అకౌంట్లో జమ కాబోతున్నాయి. సూపర్ సిక్స్ హామీల్లో మరో ప్రధాన హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కూడా ఆగస్టు 15 నుండి అమలులోకి తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు.
తాజాగా డిజిటల్ లక్ష్మి అనే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ డిజిటల్ లక్ష్మి పథకం అనగా ఏమిటీ ? ఉండవలసిన అర్హతలు ఏమిటీ ? ఈ పథకం వలన ఎవరు లబ్ధి పొందుతారు ? అనే ముఖ్యమైన వివరాలు అన్ని ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకోండి.
ప్రతీ రోజూ వివిధ ప్రభుత్వ పథకాల సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి మా వాట్సాప్ గ్రూపులో వెంటనే జాయిన్ అవ్వండి.
ఆంధ్రప్రదేశ్ మహిళలు కోసం డిజిటల్ లక్ష్మీ పథకం :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన డిజిటల్ లక్ష్మీ పథకం (Digital Lakshmi Scheme) అనేది రాష్ట్రంలోని నిరుద్యోగ మహిళల కోసం రూపొందించబడిన ఒక కొత్త పథకం. మహిళలను డిజిటల్ రంగంలో ఆర్థికంగా, సాంకేతికంగా శక్తివంతులుగా మార్చడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.
డిజిటల్ లక్ష్మీ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 9,034 కామన్ సర్వీస్ సెంటర్లు (CSC) ఏర్పాటు చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా వీటిలో సేవలు అందిస్తారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల 250 సంక్షేమ పథకాలకు సంబంధించిన సర్వీసులు వీటి ద్వారా ప్రజలు పొందవచ్చు. డిజిటల్ లక్ష్మి గా ఎంపికైన వారికి వీటి ద్వారా ఉపాధి కూడా లభిస్తుంది.
🏹 నిరుద్యోగ భృతి పథకంకు కావాల్సిన అర్హతలు , డాక్యుమెంట్స్ ఇవే – Click here
🔍 డిజిటల్ లక్ష్మీ పథకం అంటే ఏమిటి ?
మహిళల్లో డిజిటల్ పరిజ్ఞానం పెంపొందించడం.
ఇంటి వద్ద ఉద్యోగ అవకాశాలు కల్పించడం.
ఆర్థికంగా మహిళలను స్వయం ఉపాధి దిశగా తీసుకెళ్లడం.
డిజిటల్ ఇండియా లక్ష్యాలను రాష్ట్రంలో అమలు చేయడం.
👩డిజిటల్ లక్ష్మి పథకంకు ఎవరు అర్హులు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
వయస్సు 21 సంవత్సరాలు నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వివాహిత మహిళలు ఈ పథకానికి అర్హులు.
సంబంధిత స్లమ్ లెవల్ దే పరిధిలో నివసిస్తూ ఉండాలి.
స్వయం సహాయక సంఘాల్లో సభ్యులై ఉండాలి. ఆ సంఘంలో కనీసం మూడేళ్ళ క్రితం చేరి ఉండాలి.
కనీసం డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
స్మార్ట్ ఫోన్ కలిగి ఉండాలి.
📋 డిజిటల్ లక్ష్మి పథకం కు ఎలా అప్లై చేయాలి ?
అర్హులైన వారిని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (MEPMA) ఎంపిక చేస్తుంది. మీకు పైన తెలిపిన అన్ని అర్హతలు ఉంటే మెప్మా అధికారులను సంప్రదించండి.
💡డిజిటల్ లక్ష్మి పథకం ద్వారా లభించే ప్రయోజనాలు:
డిజిటల్ లక్ష్మి పథకం అమలు చేయడం ద్వారా వివిధ సంక్షేమ పథకాలుకు ప్రజలు వీరి ద్వారానే అప్లై చేసుకోవచ్చు.
మీసేవ కేంద్రాల వద్ద లభించే అన్ని రకాల సేవలు ఇక్కడ లభిస్తాయి.
మహిళలకు ఉపాధి కూడా లభిస్తుంది.
ఎంపికైన వారికి కామన్ సర్వీస్ సెంటర్లు (CSC) ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుండి 2.50 లక్షల రూపాయలు రుణం మంజూరు చేస్తారు
గమనిక :
డిజిటల్ లక్ష్మీ పథకం అనేది కేవలం ఉపాధి మాత్రమే కాదు, మహిళ సాధికారత వైపు ఒక గొప్ప అడుగు. ఆర్థిక స్వావలంబన, డిజిటల్ సాంకేతికత కలయికతో భవిష్యత్తు మహిళల చేతుల్లో ఉంది. మీరు అర్హులైతే తప్పకుండా అప్లై చేయండి.