AIIMS Mangalagiri Notification 2025 | AIIMS Mangalagiri College Of Nursing Jobs Recruitment 2025

AIIMS Mangalagiri Recruitment 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

AIIMS Mangalagiri Jobs Recruitment : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుండి రెగ్యులర్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డెంటిస్ట్రీ మరియు కాలేజ్ ఆఫ్ నర్సింగ్ డిపార్ట్మెంట్స్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ హార్డ్ కాపీని పోస్టు ద్వారా పంపించాలి…

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకొని అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లికేషన్ సబ్మిట్ చేయండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ, మంగళగిరి (ఎయిమ్స్, మంగళగిరి) నుండి విడుదలైంది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా డెంటిస్ట్రీ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అర్హతల వివరాలు :

డెంటిస్ట్రీ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యు డిగ్రీ పూర్తి చేసి మూడేళ్ల టీచింగ్ అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా తత్సమాన విద్యార్హత ఉన్నవారు కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నర్సింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఐదేళ్ల అనుభవం ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులు.

మొత్తం ఖాళీల సంఖ్య :

ఎయిమ్స్ మంగళగిరి నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఏడు పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అప్లికేషన్ తేదీలు :

ఈ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అక్టోబర్ 23వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు డిసెంబర్ 7వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీని డిసెంబర్ 17వ తేదీ లోపు పోస్ట్ ద్వారా పంపించాలి. మరియు డాక్యుమెంట్స్ అన్నీ సింగిల్ పిడిఎఫ్ చేసి facultyrec@aiimsmangalagiri.edu.in కు పంపించాలి.

ఎంపిక విధానం వివరాలు :

ఈ ఉద్యోగాల ఎంపిక స్టాండింగ్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

UR / OBC అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు 3000/- రూపాయలు మరియు ప్రాసెసింగ్ ఫీజు 100/- కలిపి మొత్తం 3,100/- రూపాయలు ఫీజు చెల్లించాలి.

SC / ST / మహిళలు అప్లికేషన్ ఫీజు 2000/- రూపాయలు మరియు ప్రాసెసింగ్ ఫీజు 100/- కలిపి మొత్తం 2,100/- రూపాయలు ఫీజు చెల్లించాలి.

అప్లికేషన్ హార్డ్ కాపీ పంపించాల్సిన చిరునామా :

Recruitment Cell,
Room No. 205, 2nd Floor, Library & Admin Building,
AIIMS, Mangalagiri, Guntur District,
Andhra Pradesh – 522503.

గమనిక :

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునేవారు క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అర్హతలు ఉంటే ఆన్లైన్ విధానంలో అప్లై చేసి అప్లికేషన్ హార్డ్ కాపీని అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ కూడా జతపరిచి పోస్ట్ ద్వారా డిసెంబర్ 17వ తేదీలోపు పంపించండి.

Download Notification – Click here

Last Date Extended Notice – Click here

Officil Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *