పదో తరగతి తరువాత మెరైన్ ఇంజనీరింగ్ కోర్సు వివరాలు | Marine Engineering Course Details in Telugu | After 10th Courses

Marine Engineering Course Details in Telugu

మీరు పదో తరగతి పూర్తి చేసి, మెరైన్ ఇంజనీరింగ్ కోర్స్ (Marine Engineering Course Details in Telugu) చేయాలి అనుకుంటున్నారా ? అయితే ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి వివరాలన్నీ స్పష్టంగా తెలుసుకోండి..

మెరైన్ ఇంజనీరింగ్ కోర్స్ పూర్తి వివరాలు (Marine Engineering Course Details in Telugu) :

మెరైన్ ఇంజనీరింగ్ కోర్సు (Marine engineering course) అనేది ఒక ప్రత్యేకమైన ఇంజనీరింగ్ కోర్సు. ఈ కోర్సులో సముద్ర నౌకలు. షిప్పులు, బోట్లు మరియు ఇతర జల వాహనాల నిర్మాణం నిర్వహణ మరియు ఆపరేషన్ వంటి వాటికి సంబంధించిన వివరాలు ఉంటాయి. ఈ కోర్సులో జాయిన్ అయిన విద్యార్థులు నౌకల యాంత్రిక వ్యవస్థలు, ప్రొపొల్సన్ సిస్టంలు, ఎలక్ట్రికల్ మరియు జర్మన్ ఎలక్ట్రికల్ మరియు థర్మల్ ఇంజనీరింగ్ వంటి అంశాలు నేర్చుకోవడం జరుగుతుంది.

ఈ కోర్సు అనేది నాలుగు సంవత్సరాల బిటెక్ కోర్సు ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి మర్చంట్ నావిలో పుష్కలమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

🏹 వివిధ విద్య మరియు ఉద్యోగాల సమాచారం మీ వాట్సాప్ కు ప్రతిరోజు ఉచితంగా రావాలి అంటే మా వాట్సాప్ చానల్లో వెంటనే జాయిన్ అవ్వండి.

🏹 Join Our What’s App Channel – Click here

ఇంటర్ ఏ గ్రూపులో చేయాలి ?

మెరైన్ ఇంజనీరింగ్ కోర్స్ పూర్తి చేయాలి అనుకునే విద్యార్థులు ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టులు అనగా MPC గ్రూప్ లో చదవాలి. మెరైన్ ఇంజనీరింగ్ కోర్స్ చేయాలి అంటే తప్పనిసరిగా ఇంటర్మీడియట్లో 60% మార్కులు వచ్చి ఉండాలి. అంతేకాకుండా పదో తరగతి లేదా ఇంటర్మీడియట్లో ఇంగ్లీషులో 50% మార్కులు వచ్చి ఉండాలి.

వయస్సు వివరాలు :

  • అభ్యర్థులు అవివివాహితులై ఉండాలి.
  • జనరల్ కేటగిరీకి చెందిన పురుష లేదా మహిళా అభ్యర్థులకు వయస్సు 25 లేదా 27 సంవత్సరాలు ఉండాలి.
  • ఓబీసీ క్యాటగిరీకి చెందిన వారికి మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • ఎస్సీ మరియు ఎస్టీ క్యాటగిరీకి చెందిన వారికి ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.

మెరైన్ ఇంజనీరింగ్ కోసం ఈ ప్రవేశ పరీక్ష రాయాలి ? :

  • మెరైన్ ఇంజనీరింగ్ కోర్సు చేయాలి అంటే ఇండియన్ మారి టైం యూనివర్సిటీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (IMU CET) రాయాలి..
  • ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ లో మీకు మంచి మార్కులు వస్తే ఇండియన్ మారి టైం యూనివర్సిటీ కు కోల్ కత్తా, చెన్నై, ముంబైలలో ఉన్న క్యాంపస్లలో సీటు పొందవచ్చు.
  • మంచి మార్కులు రాక సీటు తెచ్చుకో లేకపోతే ఇదే యూనివర్సిటీ అనుబంధంగా ఉండే కోయంబత్తూర్, చెన్నై, న్యూఢిల్లీ, ముంబై, కోచీలలో ఉండే అనుబంధ కళాశాలలో మీరు కోర్సు పూర్తి చేయవచ్చు.

🏹 మరికొన్ని ముఖ్యమైన వివరాలు :

  • మెరైన్ ఇంజనీరింగ్ కోర్స్ పూర్తి చేయాలి అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వారి మార్గదర్శకాలు ప్రకారం ఫిజికల్ ఫిట్నెస్ మరియు ఐసైటుకు సంబంధించిన సమర్పించాల్సి ఉంటుంది.
  • మెరైన్ ఇంజనీరింగ్ కోర్సు రెసిడెన్షియల్ విధానంలో ప్రస్తుతం ఈ యూనివర్సిటీ అందిస్తోంది.

🏹 కోర్సు కు సంబంధించిన అడ్మిషన్ వివరాలు తెలుసుకునేందుకు ఇండియన్ మేరీ టైం యూనివర్సిటీ యొక్క అధికారిక వెబ్సైట్ మీరు చూడవచ్చు. క్రింద ఇండియన్ మేరీ టైం యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది.

Indian Maritime University Website – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!