MHSRB MPHA(F) Exam Results Released 2025 :
గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ MPHA (F) / ANM పరీక్ష రాసిన వారు ఎదురుచూస్తున్న పరీక్ష ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) ఈరోజు అధికారికంగా విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి తమ మార్కులు తెలుసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో 1931 MPHA (F) / ANM ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మెడికల్ మరియు హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 2023 సంవత్సరంలో నోటిఫికేషన్ విడుదల చేసి 29-12-2024 తేదీన కంప్యూటర్ ఆధారత పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 20,600 మంది అభ్యర్థులు హాజరు కావడం జరిగింది.
ప్రాథమిక “కీ” ను విడుదల చేసి దానిపై అభ్యంతరాలు కూడా స్వీకరించడం జరిగింది. అభ్యర్థుల నుండి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన ” కీ కమిటీ” ప్రిలిమినరీ “కీ” ను ఫైనల్ “కీ” గా ప్రకటించింది.
ఎట్టకేలకు MHSRB ఈరోజు అనగా 19-05-2025 తేదీన పరీక్ష ఫలితాలను (మార్కులను) విడుదల చేయడం జరిగింది.
కాంట్రాక్టు లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన వారికి వెయిటేజీ పాయింట్లు కలిపి ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ త్వరలో విడుదల చేస్తామని తాజాగా విడుదల చేసిన వెబ్ నోటీసులో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) పేర్కొంది.
How to Check MHSRB MPHA(F) Exam Results :
అభ్యర్థులు తమ మార్కులను తెలుసుకునేందుకు క్రింద ఉన్న లింకుపై తమ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.
🏹 Download Web Note – Click here
🏹 MPHA (F) Results – Click here