పదో తరగతి విద్యార్థులకు సంవత్సరానికి 75000 వచ్చే స్కాలర్షిప్ | Vidyadhan scholarship full details

పదో తరగతి విద్యార్థులకు విద్యాధన్ స్కాలర్షిప్ – పూర్తి వివరాలు ఇవే :

ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాలలో మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు లేదా  మీకు తెలిసిన విద్యార్థులకు 90% మార్కులు దాటయా లేదా 9 సీజీపీఏ మార్కులు దాటాయా అయితే వీరు విద్యాధన్ స్కాలర్షిప్ నకు అర్హులు.

దివ్యాంగులకైతే 75% మార్కులు లేదా 7.5 సిజిపిఏ సాధించిన వారు కూడా ఈ స్కాలర్షిప్ పొందేందుకు అర్హులే. 

విద్యాధన్ స్కాలర్షిప్ అంటే ఏమిటి ? ఈ స్కాలర్షిప్ కి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు ?  ఈ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి అవసరమగు ధృవపత్రాలు ఏంటి? ఎవరు అర్హులు ? ఏ విధంగా ఎంపిక చేస్తారు ?వంటి అన్ని అంశాల కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

🔥 విద్యాధన్ స్కాలర్షిప్ అనగా ? :

మంచి మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఇంటర్మీడియట్ / కళాశాల విద్య చదువుకునేందుకు గాను సరోజినీ దామోదర్ ఫౌండేషన్ సంస్థ విద్యాధన్ స్కాలర్షిప్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఇప్పటికే కేరళ , కర్ణాటక , ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ , తమిళనాడు , పుదుచ్చేరి , గుజరాత్ , మహారాష్ట్ర , గోవా , ఒడిశా , న్యూఢిల్లీ , లడక్ , బీహార్ , జార్ఖండ్ , పంజాబ్, హిమాచల ప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్  రాష్ట్రాలకు చెందిన 8,000 మంది విద్యార్థులు ఈ స్కాలర్షిప్ ద్వారా లబ్ధి పొందుతున్నారు.

🔥 ఏ విధంగా ఉపయోగపడుతుంది? :

విద్యాధన్ స్కాలర్షిప్ పథకానికి ఎంపిక కాబడిన వారికి ఫౌండేషన్ ద్వారా రెండు సంవత్సరాలు పాటు స్కాలర్షిప్ ను పొందుతారు.

ఎంపిక కాబడిన విద్యార్థి వారి ప్రతిభ ఆధారంగా వారికి నచ్చిన రంగంలో డిగ్రీ అభ్యసించేందుకుగాను కూడా ప్రోత్సాహం లభిస్తుంది. 

ఎంపిక కాబడిన విద్యార్థి వారు చదువుతున్న కోర్సు మరియు ఆ కోర్స్ యొక్క కాల పరిమితిని ఆధారంగా చేసుకుని సంవత్సరానికి ₹10,000 నుండి 75 వేల రూపాయల వరకు ఈ స్కాలర్షిప్ ను శాంక్షన్ చేస్తారు. 

🔥 విద్యాదాన్ స్కాలర్షిప్ 2025 వివరాలు :

2025 – 26 సంవత్సరానికి సంబంధించి విద్యా దాస్ స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదలైంది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపిక కాబడిన విద్యార్థులకు 2025 – 26 విద్యా సంవత్సరానికి, 11 వ తరగతి చదివేందుకు గాను పదివేల రూపాయలను మరియు 2026 – 27, 12వ తరగతి చదివేందుకు గాను పదివేల రూపాయలు ఈ స్కాలర్షిప్ కార్యక్రమం ద్వారా అందజేస్తారు.

🔥 ఈ స్కాలర్షిప్ కి ఎవరు అర్హులు & అవసరగు అర్హతలు:

2024 – 25 విద్యా సంవత్సరం లో 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించి , ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా చదువుతున్న వారు ఈ పథకానికి అర్హత కలిగి ఉంటారు.

కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి.

విద్యార్థి 10 వ తరగతి లో కనీసం 90 శాతం మార్కులు లేదా 9.0 CGPA కలిగి వుండాలి.

దివ్యాంగ విద్యార్థులు కనీసం 75 శాతం మార్కులు లేదా 7.5 CGPA మార్కులు కలిగి ఉండాలి.

🔥 ఈ విధంగా ఎంపిక చేస్తారు? :

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ను ఆన్లైన్ వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

ఆన్లైన్ వ్రాత పరీక్ష నిర్వహణ తేది ను మరియు వివరాలను విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇచ్చిన మెయిల్ ఐడి కి పంపుతారు.

🔥 దరఖాస్తు చేయు విధానం :

విద్యార్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ప్లే స్టోర్ లోని విద్యాదాన్ మొబైల్ అప్ డౌన్లోడ్ చేసుకొని కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్థులు సొంత ఇమెయిల్ ఐడి కలిగి వుండాలి.

వెబ్సైట్ లో వివరాలను 10 వ తరగతి మార్క్స్ షీట్ లో ఉన్న విధంగా ఫిల్ చేయాలి.

🔥 అవసరమగు ధ్రువపత్రాలు :

దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులు ఈ క్రింది ధ్రువపత్రాలను కలిగి వుండాలి మరియు స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంది.

10వ తరగతి మార్క్ షీట్

పాస్పోర్ట్ సైజ్ ఫోటో

మండల రెవెన్యూ అధికారి ధృవీకరించిన, 2025 ఆదాయ ధ్రువీకరణ పత్రం

దివ్యాంగులు అయితే సంబంధిత ధ్రువపత్రం

🔥 సంప్రదించవలసిన వివరాలు :

దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏవైనా సందేహాలు ఉంటే విద్యార్థులు vidyadhan.andhra@sdfoundationindia.com కి సంప్రదించవచ్చు. మరియు విద్యాధాన్ హెల్ప్ డెస్క్ నెంబర్ 0806833350 /+91806833350 కి సంప్రదించవచ్చు.

🔥 ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 30/06/2025.

ఆన్లైన్ వ్రాత పరీక్ష నిర్వహణ తేది : 13 జూలై 2025.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!