AP Mega DSC Latest Updates :
మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ముగిసింది. అలానే డిఎస్సీ తో పాటుగా ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల లెక్చరర్ ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ శుభవార్త తెలియచేసింది.
పైన పేర్కొన్న అంశాల పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 Join Our What’s App Channel – Click here
✅Join Our Telegram Channel – Click here
🔥 మెగా DSC కు 5లక్షల లకు పైగా దరఖాస్తులు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగిసింది.
మొత్తం అన్ని పోస్టులకు కలిపి 5,77,417 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు.
జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తు వివరాలను పరిశీలిస్తే ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి అత్యధికంగా 39,997 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
కడప జిల్లా నుంచి అత్యల్పంగా 15,812 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తున్న ఈ మెగా డీఎస్సీకి 7,159 మంది ఇతర రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
🔥 మే 30 నుండి హాల్ టికెట్ల విడుదల:
మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకొనుట కొరకు చివరి గడువు ముగియడంతో మరికొద్ది రోజులలో హల్ టికెట్ల విడుదల కు రంగం సిద్ధం చేస్తున్నారు.
మే నెల 30 వ తేదీ నుండి హాల్ టికెట్లు జారీ చేయనున్నారు.
జూన్ 06 వ తేదీ నుండి డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు.
🔥 డిఎస్సీ నేపధ్యంలో ఏపీపీఎస్సీ వివిధ పరీక్షల వాయిదా :
డిఎస్సీ పరీక్షలు జూన్ 06 వ తేదీ నుండి నిర్వహిస్తున్న నేపధ్యంలో అదే తేదీలలో అనగా జూన్ 06 నుండి జూన్ 26 మధ్య నిర్వహించివలసిన వివిధ పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది.
గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఏపీపీఎస్సీ , ప్రభుత్వ ఉద్యోగుల డిపార్ట్మెంట్ టెస్టులు, మరియు ఇంటర్, డిగ్రీ , పాలిటెక్నిక్ కళాశాలల లెక్చరర్ ఉద్యోగాలకు నిర్వహించవలసిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
డిఎస్సీ మరియు పైన పేర్కొన్న పరీక్షలు కు ఎక్కువగా ఒకే అభ్యర్థులు హాజరయ్యే నేపథ్యంలో అభ్యర్థుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు.