10th, ITI, Diploma, డిగ్రీ అర్హతలతో BEL లో ఉద్యోగాలు | BEL Hyderabad Recruitment 2025 | Latest Government Jobs Alerts 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలోని నవరత్న కంపెనీ, ప్రతిష్టాత్మకమైన ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపిక అయిన వారు ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్ నావల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్ లాండ్ సిస్టమ్స్ హైదరాబాద్ నందు పని చేయవలసి వుంటుంది. 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

  • 32 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ – 08
  • టెక్నీషియన్ – సి – 21
  • జూనియర్ అసిస్టెంట్ – 03

🔥 విద్యార్హత : 

  1. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ :
    1. గుర్తింపు పొందిన సంస్థ నుండి ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ 3 సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణత సాధించి వుండాలి.
  1. టెక్నీషియన్ – సి :
    1. పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి, ఐటిఐ మరియు ఒక సంవత్సరం అప్రెంటిస్ పూర్తిచేసి వుండాలి.

            (లేదా)

  1. పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి, 3 సంవత్సరాల నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణత సాధించాలి.
  1. జూనియర్ అసిస్టెంట్ :
    1. ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ / యూనివర్సిటీ నుండి బి.కమ్ / బిబిఎం ఉత్తీర్ణత సాధించాలి.

🔥 గరిష్ఠ వయస్సు :

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల 28 సంవత్సరాల లోపు గల వారై వుండాలి.
  • ఓబీసీ (NCL) వారికి 3 సంవత్సరాలు , ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు , దివ్యాంగులు కి 10 సంవత్సరాలు వయోసదలింపు కలదు.
  • వయస్సు నిర్ధారణ కొరకు 01/03/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ధారించారు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్లైన్  విధానం లో అధికారిక వెబ్సైట్ ద్వారా  దరఖాస్తు చేసుకోవాలి.

🔥 దరఖాస్తు ఫీజు :

  • జనరల్ / ఓబీసీ / EWS అభ్యర్థులు 250/- + GST ను దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ ఏక్స్ సర్వీస్ మాన్ , దివ్యాంగులు కి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

🔥 జీతం :

  • ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 24,500/- రూపాయల పే స్కేల్ వర్తిస్తుంది. వీరికి 90,000 /- రూపాయల వరకు జీతం లభిస్తుంది.
  • టెక్నీషియన్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 21,500/- రూపాయల పే స్కేల్ వర్తిస్తుంది. వీరికి 82,000 /- రూపాయల వరకు జీతం లభిస్తుంది.
  • వివిధ అలోవన్స్ లు కూడా లభిస్తాయి.

🔥 ఎంపిక విధానం :

  • వ్రాత పరీక్ష నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • 150 మార్కులకు గాను ఎంపిక నిర్వహిస్తారు.ఇందులో భాగంగా జనరల్ ఆప్టిట్యూడ్ 50 మార్కులకు & టెక్నికల్ ఆప్టిట్యూడ్ 100 మార్కులకు గాను వుంటాయి.

 🔥 ముఖ్యమైన తేదిలు

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 09/04/2025

👉  Click here for notification

👉  Click here to Apply

👉 Click here for official website 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *