డిగ్రీ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ (CGL) నోటిఫికేషన్ ద్వారా 18,147 పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భర్తీ చేయబోతుంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 22వ తేదీన SSC CGL నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. మే 21వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు అవుతారు.
మీరు ఈ ఉద్యోగాలకు ఇప్పటినుంచి ప్రిపేర్ అయితే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది ?
SSC CGL నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు టైర్-1 , టైర్-2 పరీక్షలు మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
టైర్-1 పరీక్షలో 100 ప్రశ్నలు 200 మార్కులకు ఇస్తారు. ఈ పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీటివ్ ఆప్టిట్యూడ్ , ఇంగ్లీష్ కాంప్రెహెన్షన్ నుండి ప్రశ్నలు ఇస్తారు.
టైర్-1 పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే టైర్-2 పరీక్ష నిర్వహిస్తారు.
పోస్టులను అనుసరించి నెలకు 25,500/- నుండి 1,42,400/- వరకు జీతము పొందవచ్చు.
త్వరలో విడుదల కాబోతున్న ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఇప్పటినుంచే పరీక్షకు సన్నద్ధమైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మా వెబ్సైట్ ద్వారా మీకు పూర్తి నోటిఫికేషన్ వివరాలు కూడా తెలియజేస్తాం. ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ కాకూడదు అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 గ్రామీణ విద్యుత్ సంస్థల్లో ఫీల్డ్ సూపర్వైజర్ ఉద్యోగాలు – Click here
ప్రతీ రోజూ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం What’s App / Telegram లో జాయిన్ అవ్వండి.
📌 Join Our What’s App Channel
📌 Join Our Telegram Channel