తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని కొత్తగా ఏర్పాటు చేయబడిన మెడికల్ కాలేజీ , కరీంనగర్ నందు వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు వారధి సొసైటీ , కరీంనగర్ నుండి ఉద్యోగ ప్రకటన విడుదల అయ్యింది.
ఈ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : వారధి సొసైటీ , కరీంనగర్
- కరీంనగర్ జిల్లాకు చెందిన ,అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 42
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- ల్యాబ్ అటెండెంట్ -15
- స్టోర్ కీపర్ / స్టెనో టైపిస్ట్ / రికార్డు క్లర్క్ / రికార్డు అసిస్టెంట్ / డేటా ఎంట్రీ ఆపరేటర్ – 07
- ఈసిజి టెక్నీషియన్ -01
- సిటీ స్కాన్ టెక్నీషియన్ – 02
- అనస్తిషియా టెక్నీషియన్ -04
- ఎలక్ట్రీషియన్ – 02
- ప్లంబర్ – 01
- థియేటర్ అసిస్టెంట్ – 04
- గ్యాస్ ఆపరేటర్ – 01
🔥 విద్యార్హత :
1)ల్యాబ్ అటెండెంట్ :
- అభ్యర్థి గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంటర్మీడియట్ మరియు MLT పూర్తి చేసి వుండాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
- తెలంగాణ పారామెడికల్ బోర్డు నందు రిజిస్ట్రేషన్ అయి వుండాలి.
- లేబరేటరీ లో కనీసం రెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవం మరియు అనుభవ దృవీకరణ పత్రం కలిగివుండాలి.
2) స్టోర్ కీపర్ / స్టెనో టైపిస్ట్ / రికార్డు క్లర్క్ / రికార్డు అసిస్టెంట్ / డేటా ఎంట్రీ ఆపరేటర్ :
- అభ్యర్థి గుర్తింపు పొందిన సంస్థ నుండి కంప్యూటర్ ఒక సబ్జెక్టు గా కలిగి వున్న డిగ్రీ లేదా డిగ్రీ తొ పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
3) ఈసిజి టెక్నీషియన్ :
- అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
- గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇసిజి డిప్లొమా ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- తెలంగాణ పారామెడికల్ బోర్డు నందు రిజిస్టర్ అయి వుండాలి.
- కనీసం రెండు సంవత్సరాలు ఈసీజీ డిపార్ట్మెంట్ లో పనిచేసిన అనుభవం , అనుభవ దృవీకరణ పత్రం కలిగివుండాలి.
4) సిటీ స్కాన్ టెక్నీషియన్ :
- అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
- గుర్తింపు పొందిన సంస్థ నుండి మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- తెలంగాణ పారామెడికల్ బోర్డు నందు రిజిస్టర్ అయి వుండాలి.
- కనీసం రెండు సంవత్సరాలు ఎక్స్ – రే డిపార్ట్మెంట్ లో పనిచేసిన అనుభవం , అనుభవ దృవీకరణ పత్రం కలిగివుండాలి.
5) అనస్తిషియా టెక్నీషియన్ :
- అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
- గుర్తింపు పొందిన సంస్థ నుండి అనస్తిషియా టెక్నీషియన్ కోర్సు లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- తెలంగాణ పారామెడికల్ బోర్డు నందు రిజిస్టర్ అయి వుండాలి.
- కనీసం రెండు సంవత్సరాలు అనస్తిషియా టెక్నీషియన్ గా పనిచేసిన అనుభవం , అనుభవ దృవీకరణ పత్రం కలిగివుండాలి.
6) ఎలక్ట్రీషియన్ :
- అభ్యర్థి గుర్తింపు పొందిన సంస్థ నుండి 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- ఎలక్ట్రీషియన్ విభాగంలో డిప్లొమా లేదా ఐటిఐ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- కనీసం ఒక సంవత్సరం పని అనుభవం & అనుభవ దృవీకరణ పత్రం కలిగివుండాలి.
7) ప్లంబర్ :
- అభ్యర్థి గుర్తింపు పొందిన సంస్థ నుండి 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- ప్లంబర్ విభాగంలో ఐటిఐ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- కనీసం ఒక సంవత్సరం పని అనుభవం & అనుభవ దృవీకరణ పత్రం కలిగివుండాలి.
8) థియేటర్ అసిస్టెంట్ :
- అభ్యర్థి గుర్తింపు పొందిన సంస్థ నుండి 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- గుర్తింపు పొందిన సంస్థ నుండి ప్రథమ చికిత్స ( ఫస్ట్ ఎయిడ్) శిక్షణ దృవీకరణ పత్రం పొంది వుండాలి.
- DMST ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- అభ్యర్థి ఆపరేషన్ థియేటర్/ నర్సింగ్ ఆర్డర్లి నందు కనీసం 5 సంవత్సరం పని అనుభవం & అనుభవ దృవీకరణ పత్రం కలిగివుండాలి.
9) గ్యాస్ ఆపరేటర్ :
- అభ్యర్థి గుర్తింపు పొందిన సంస్థ నుండి 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- గుర్తింపు పొందిన ఐటిఐ నుండి సంబంధిత ట్రేడ్ నందు ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నుండి మ్యాన్ పోల్డ్ ఆపరేషన్ నందు కనీసం 3సంవత్సరాల పని అనుభవం మరియు పని అనుభవం దృవీకరణ పత్రం కలిగి వుండాలి.
🔥 వయస్సు :
- 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు ను 11/11/2024 ను కట్ ఆఫ్ తేదిగా నిర్ధారించారు.
- ఎస్సీ, ఎస్టీ , బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- అంగవైకల్యం కల అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- ఎక్స్ సర్విస్ మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు వారి యొక్క బయోడేటా లేదా అప్లికేషన్ తో పాటు విద్యార్హత పత్రములు జిరాక్స్ ప్రతులను గెజిటెడ్ అధికారి దృవీకరణ తో నవంబర్ 20 , 2024 తేది సాయంత్రం 5:00 గంటల లోగా క్రింద పేర్కొన్న చిరునామా సమర్పించవలెను.
🔥 దరఖాస్తు చేర్చవలసిన చిరునామా :
- జిల్లా పరిశ్రమల కేంద్రము, పద్మానగర్, కరీంనగర్ నందు గల వారధి సొసైటీ కార్యాలయం నందు సమర్పించవలెను.
🔥 జీతం :
- అభ్యర్థులు ఎంపిక కాబడిన పోస్టుల ఆధారంగా జీతం లభించింది.
- ల్యాబ్ అటెండెంట్ వారికి నెలకు 15,600 రూపాయలు
- స్టోర్ కీపర్ / స్టెనో టైపిస్ట్ / రికార్డు క్లర్క్ / రికార్డు అసిస్టెంట్ / డేటా ఎంట్రీ ఆపరేటర్ & ఎలక్ట్రీషియన్ & ప్లంబర్ & థియేటర్ అసిస్టెంట్ వారికి నెలకు 19500/- రూపాయలు
- ఈసిజి టెక్నీషియన్ & సిటీ స్కాన్ టెక్నీషియన్ & అనస్తిషియా టెక్నీషియన్ వారికి నెలకు 22750/- రూపాయలు
- గ్యాస్ ఆపరేటర్ వారికి నెలకు 15600/- రూపాయలు జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేది:
- తేది 20/11/2024 లోగా దరఖాస్తు ను ఆఫీసు వారి కార్యాలయం నకు చేర్చాలి.
- అభ్యర్థి వయస్సు నిర్ధారణ కొరకు 11/11/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
🔥 ముఖ్యమైన అంశాలు :
- అభ్యర్థులు 1 వ తరగతి నుండి 7 వ తరగతి లోపుగా ఏదైనా 4 సంవత్సరాలు కరీంనగర్ జిల్లా లో చదివి వుండాలి మరియు సంబంధిత దృవీకరణ పత్రం లేదా స్టడీ సర్టిఫికెట్ జతపరచాలి.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యొక్క వివరాలు 02/12/2024 న వారధి సొసైటీ కార్యాలయం నందు గల నోటీసు బోర్డు లో అతికిస్తారు.ఏవైనా అభ్యంతరాలు వున్నచో 06/12/2024 సాయంత్రం 5:00 గంటల లోగా వ్రాత పూర్వకంగా తెలుపవలెను.
👉 Click here for notification – Click here