AP PHC , UPHC Jobs Notification 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వివిధ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్స్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, LGS, FNO మరియు శానిటరీ అటెండెంట్ కం నైట్ వాచ్మెన్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్లు ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉంటే ఫిబ్రవరి 2వ తేదీ లోపు అప్లై చేయండి.
✅ పదో తరగతి అర్హతతో ఆంధ్రప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here
Table of Contents :
నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వ సంస్థ :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి విడుదలైంది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్ టెక్నీషియన్, FNO, సానిటరీ అటెండెంట్ కం నైట్ వాచ్మెన్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు LGS ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీలు సంఖ్య :
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కలిపి మొత్తం 45 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హతల వివరాలు :
పదో తరగతి, డిగ్రీ, D.Pharmacy, B.Pharmacy మరియు ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు చేసిన వారు అర్హులు
అప్లికేషన్ తేదీలు :
అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జనవరి 23వ తేదీ నుండి ఫిబ్రవరి రెండవ తేదీలోపు అప్లికేషన్ స్వయంగా వెళ్లి లేదా పోస్టు ద్వారా పంపించి అప్లై చేయొచ్చు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
ఓసీ, బీసీ అభ్యర్థులు 800/- రూపాయలు అప్లికేషన్ ఫీజ్ చెల్లించాలి.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
అప్లికేషన్ అందజేయాల్సిన లేదా పంపించవలసిన చిరునామా :
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయము, గుంటూరు, కలెక్టరేట్ ఎదురుగా, నగరంపాలెం, గుంటూరు.
ఉద్యోగాల ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతము వివరాలు :
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 32,670/- రూపాయలు జీతం చెల్లిస్తారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 23,393/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 23,393/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 18,450/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
LGS, FNO, శానిటరీ అటెండెంట్ కం నైట్ వాచ్మెన్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 15,000/- రూపాయలు చొప్పున జీతము చెల్లిస్తారు.
✅ Download Notifications & Applications – Click here
