Telangana District Court Record Assistant Notification 2026 : తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అర్హత ఉన్న నిరుద్యోగులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ విద్యార్హతతో మొత్తం 36 పోస్టులు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జనవరి 26వ తేదీ నుండి ఫిబ్రవరి 13వ తేదీలోపు అప్లై చేయాలి.
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క అర్హతలు, ఎంపిక విధానము, జీతం, అప్లికేషన్ విధానం, పరీక్ష విధానము మరియు సిలబస్ యొక్క వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకున్న తర్వాత అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి.
✅ తెలంగాణ జిల్లా కోర్టుల్లో 198 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here
Table of Contents
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నుండి జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ కోసం విడుదల చేయబడింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 36 రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు.
భర్తీ చేస్తున్న మొత్తం ఖాళీల సంఖ్య :
తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 36 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హతల వివరాలు :
ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థి అప్లై చేసే జిల్లాలో మాట్లాడే స్థానిక భాష పరిజ్ఞానం కలిగి ఉండాలి.
✅ పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు – Click here
ఎంపిక విధానం :
- తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో భర్తీ చేస్తున్న రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.
- పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో జనరల్ నాలెడ్జ్ నుండి 60 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ నుండి 45 ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్షకు 120 నిమిషాలు సమయం ఇస్తారు.
ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఉండవు.
జీతము వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు 22,240/- నుండి 62,300/- వరకు ఉండే పే స్కల్ ప్రకారం జీతం చెల్లిస్తారు.
అప్లికేషన్ తేదీలు :
అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జనవరి 24వ తేదీ నుండి ఫిబ్రవరి 13వ తేదీ లోపు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
- ఓసీ, బీసీ అభ్యర్థులు 600/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- SC, ST, PH, EWS అభ్యర్థులు 400/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
హాల్ టికెట్స్ విడుదల తేదీ :
హాల్ టికెట్స్ విడుదల తేదీ వివరాలను తర్వాత వెల్లడిస్తామని నోటిఫికేషన్లో తెలియజేశారు.
పరీక్ష తేదీ :
అర్హత గల అభ్యర్థులకు ఏప్రిల్ 2026 లో పరీక్ష నిర్వహించడం జరుగుతుందని నోటిఫికేషన్లో ప్రకటించడం జరిగింది.
▶️ Download Notification – Click here
✅ Official Website – Click here
