10th, 12th అర్హతలతో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు భర్తీ | CSIR CLRI MTS, Junior Secretariat Assistent Jobs Recruitment 2026

CSIR CLRI MTS Recruitment 2026
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

CSIR CLRI Recruitment 2026 : కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన CSIR – సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి జూనియర్ స్టెనో గ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగి అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. పదో తరగతి మరియు 10+2 అర్హతలు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి.

ప్రభుత్వ విద్యా సంస్థలో 10th అర్హతతో ఉద్యోగాలు – Click here

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

CSIR – సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అయ్యింది…

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

జూనియర్ స్టెనో గ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (GEN), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (S&P), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (F&A) మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

అర్హతల వివరాలు :

  • జూనియర్ స్టెనో గ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (GEN), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (S&P), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (F&A) ఉద్యోగాలకు 10+2 విద్యార్హత కలిగిన వారు అర్హులు.
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయిన వారు అర్హులు.

మొత్తం ఖాళీల సంఖ్య :

  • CSIR – CLRI నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
CSIR CLRI MTS Syllabus 2026

అప్లికేషన్ తేదీలు :

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు జనవరి 17వ తేదీ నుండి ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
  • ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 22వ తేదీలోపు అప్లై చేయాలి.

ఎంపిక విధానం వివరాలు :

అర్హత గల అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

వయస్సు వివరాలు :

పోస్టులను అనుసరించి 18 సంవత్సరాలు నుండి 28 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు .

వయస్సులో సడలింపు వివరాలు :

ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో SC, ST అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది. OBC అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు – 500/- రూపాయలు
  • SC, ST, PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.

అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :

CSIR CLRI భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. All the best 👍

Download Notification – Click here

Apply Online – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *