RBI 572 Office Attendant Recruitment 2026 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఆఫీస్ అటెండెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 572 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తుండడంతో నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం గా చెప్పవచ్చు. ఎంపికైన వారు మన తెలుగు రాష్ట్రంలోనే పనిచేసే అవకాశాన్ని కూడా పొందవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులకు పదో తరగతి అర్హతతో పాటు తెలుగు భాష కూడా వచ్చి ఉండాలి.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ మీకు తెలుసుకోవాలి అని ఉందా ? అయితే ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకొని ఈ ఉద్యోగాలకు మీరు త్వరగా అప్లై చేసేయండి.
✅ AP విద్యుత్ శాఖలో ఉద్యోగాలు – Click here
Table of Contents :
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కార్యాలయాల్లో ఆఫీస్ అటెండెంట్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
మొత్తం ఖాళీల సంఖ్య :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 572 పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.

విద్యార్హతల వివరాలు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అభ్యర్థులు పదో తరగతి పాస్ అయి ఉండాలి.
- అభ్యర్థి అప్లై చేసే కార్యాలయం ఉండే రాష్ట్రానికి చెందిన స్థానిక భాష వచ్ ఉండాలి.
- అభ్యర్థి డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతలు కలిగి ఉండకూడదు.
వయసు వివరాలు :
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాలు నుండి గరిష్టంగా 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
- ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.
- PwBD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
జీతము వివరాలు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు బేసిక్ పే 24,250/- రూపాయలు ఉంటుంది.
- అన్ని రకాల అలవెన్స్లు కలిపి ప్రారంభంలో 46,029/- రూపాయలు జీతము వస్తుంది.
ఎంపిక విధానం వివరాలు :
- ఈ ఉద్యోగాలు ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు ఒక పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో 120 ప్రశ్నలు 120 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది.
- పరీక్షలో రీజనింగ్ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు, జనరల్ ఇంగ్లీష్ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు, జనరల్ అవేర్నెస్ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు, న్యూమరికల్ ఎబిలిటీ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు ఇస్తారు.
- పరీక్ష సమయం 90 నిమిషాలు ఉంటుంది.

- పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు లాంగ్వేజ్ ప్రొఫెషియన్సీ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అభ్యర్థులు క్వాలిఫై అయితే చాలు తుది ఎంపికలో ఈ యొక్క పరీక్షలో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకోరు..
అప్లికేషన్ ఫీజు వివరాలు :
- ఎస్సీ, ఎస్టీ, PwD, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 50/- రూపాయలు మరియు అదనంగా 18% GST చెల్లించాలి.
- GEN / OBC / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 450/- రూపాయలు మరియు అదనంగా 18% GST చెల్లించాలి.
అభ్యర్థులకు ముఖ్య గమనిక :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేయండి.
▶️ Download Notification – Click here
✅ Official Website – Click here
