Andhra Pradesh KGBV Notification 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలను జిల్లాల వారీగా భర్తీ చేసేందుకు అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ANM వంటి అర్హతలు ఉన్న వారు అప్లై చేయవచ్చు.. ఈ ఉద్యోగాలన్నింటినీ అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి..
✅ డిగ్రీ అర్హతతో ట్రాఫిక్ సూపర్వైజర్ ఉద్యోగాలు భర్తీ – Click here
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , సమగ్ర శిక్ష నుండి కస్తూరిబా గాంధీ బాలిక విద్యా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీలు భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
టైప్-3 KGBV ల్లో ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, ANM, అకౌంటెంట్, అటెండర్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే వాచ్ ఉమెన్, నైట్ వాచ్ ఉమెన్, స్కావెంజర్, స్వీపర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మరియు టైప్ -4 KGBV ల్లో వార్డెన్, పార్ట్ టైమ్ టీచర్, చౌకీదార్, హెడ్ కుక్ మరియు అసిస్టెంట్ కుక్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
విద్యార్హతలు :
పోస్టులను అనుసరించి చదువు లేని వారు, 10th, ఇంటర్, డిగ్రీ, ANM మరియు ఇతర అర్హతలు ఉన్న వారు అప్లై చేయవచ్చు..
మొత్తం ఖాళీల సంఖ్య :
నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1095 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
అప్లికేషన్ తేదీలు :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను జనవరి 3వ తేదీ నుండి జనవరి 11వ తేదీ లోపు అప్లై చేయాలి..
ఇంటర్వ్యూ తేదీలు :
అభ్యర్థులను 2026 జనవరి 23, 24 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు..
తుది ఎంపిక జాబితా విడుదల తేదీ :
28-01-2026 తేదీన అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదల చేస్తారు..
అభ్యర్థులు డ్యూటీ లో రిపోర్టింగ్ చేయాల్సిన తేదీ :
ఎంపికైన అభ్యర్థులు 01-02-2026 తేదీన రిపోర్టింగ్ చేయాలి.
వయస్సు వివరాలు :
01-07-2025 తేదీ నాటికి 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
SC, ST, BC, EWS అభ్యర్థులకు గరిష్ట వయస్సు 50 సంవత్సరాల లోపు ఉండాలి.
✅ Download Notification – Click here
✅ Official Website – Click here
