తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో సూపర్వైజర్ ట్రైనింగ్ ఉద్యోగాలు భర్తీ | Telanagana RTC Jobs Recruitment 2025

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

TGSRTC Supervisor Trainee Jobs Apply Online : నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ మరియు మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 198 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానములో 2025 డిసెంబర్ 30వ తేదీ నుండి 2026 జనవరి 20వ తేదీలోపు అప్లై చేయాలి.

కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు భర్తీ – Click here

రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో సూపర్వైజర్ ట్రైనీ మరియు మెకానికల్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

నోటిఫికేషన్ ద్వారా మొత్తం 198 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాలు 84 మరియు మెకానికల్ ట్రైనీ 114 పోస్టులు భర్తీ చేస్తున్నారు..

విద్యార్హతలు :

సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు అర్హులు.

మెకానికల్ ట్రైనీ ఉద్యోగాలకు మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో డిప్లమో పూర్తి చేసిన వారు అర్హులు.

వయస్సు వివరాలు :

2025 జూలై 1వ తేదీ నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

వయస్సులో సడలింపు వివరాలు :

ఎస్సీ , ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది..

జీతము :

ఎంపికైన అభ్యర్థులకు 21,080/- నుండి 81,400/- వరకు జీతము ఉండే పే స్కేల్ ప్రకారం జీతముతో పాటు ఇతర అలవెన్స్లు కూడా ఇస్తారు.

ఎంపిక విధానం :

అర్హులైన అభ్యర్థులకు రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు..

అప్లికేషన్ ఫీజు వివరాలు :

ఓసీ, బీసీ అభ్యర్థులకు 800/- మరియు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 400/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

అప్లికేషన్ తేదీలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు 2025 డిసెంబర్ 30వ తేదీ నుండి 2026 జనవరి 20వ తేదీ లోపు అప్లై చేయాలి..

దరఖాస్తు విధానం :

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ www.tgprb.in వెబ్సైట్ లో ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి..

Download Notification – Click here

Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *