DSSSB Multi Tasking Staff Notification 2025 : కేవలం పదో తరగతి అర్హతతో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న భారతీయ పౌరులు నుండి దరఖాస్తులు కోరుతూ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో 17 డిసెంబర్ 2025 నుండి 15 జనవరి 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. తాజాగా విడుదల చేయబడ్డ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అర్హత ఉండేవారు తప్పనిసరిగా త్వరగా అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
✅ RTC లో కండక్టర్ ఉద్యోగాలు – Click here
Table of Contents :
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి విడుదలైంది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
వివిధ ప్రభుత్వ శాఖల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
విద్యార్హతలు :
పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
అప్లికేషన్ విధానము :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో ఢిల్లీ సబర్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు యొక్క అధికారిక వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు :
అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో 17 డిసెంబర్ 2025 నుండి 15 జనవరి 2026 వరకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు..
ఫీజు వివరాలు :
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు, మహిళా అభ్యర్థులకు, PWD మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
మిగతా అభ్యర్థులు 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
జీతము వివరాలు :
లెవెల్ -1 పే స్కేల్ ప్రకారం 18,000/- నుండి 56,100/- వరకు జీతం ఇస్తారు. ఈ జీతంతో పాటు అదనంగా అన్ని రకాల అలవెన్సులు ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అందుతాయి.
ఎంపిక విధానము :
- ఉద్యోగాలు ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 200 ప్రశ్నలు 200 మార్కులకు ఇస్తారు.
- ఈ పరీక్షలో ప్రశ్నలు ఇంగ్లీష్ మరియు హిందీ భాషలో ఉంటాయి.
- ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం గుర్తిస్తే ఒక మార్కు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ విధానము ఉంటుంది.
▶️ Download Full Notification – Click here
▶️ Official Website – Click here
