ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా కొద్ది నెలలుగా కౌశలం అనే పేరుతో సర్వే నిర్వహించింది. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగుల వివరాలు సేకరించింది. ప్రస్తుతం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే ప్రక్రియలో భాగంగా కౌశలం పరీక్షలు ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో నిర్వహిస్తుంది. ఈ పరీక్షలు మొదటి విడతలో డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు జరుగుతున్నాయి.
ప్రతి సచివాలయంలో రోజుకు రెండు స్లాట్స్ లో ప్రతి స్లాట్ లో ఒక్కొక్కరికి పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులకు తమ పరీక్ష తేదీ, పరీక్ష స్లాట్, మరియు ఏ సచివాలయంలో పరీక్షకు హాజరు కావాలి అనే వివరాలు టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్ మరియు మెయిల్స్ పంపించడం జరిగింది. ప్రస్తుతం మెసేజ్ రాని అభ్యర్థులకు మరో షెడ్యూల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
క్రింద ఇచ్చిన లింకు పైన క్లిక్ చేసి మీరు Excel file డౌన్లోడ్ చేసుకుని అందులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి. మీ పేరు ఉంటే మీ పేరు ఎదురుగా మీరు సచివాలయం పేరు, పరీక్ష తేదీ మరియు పరీక్ష స్లాట్ వివరాలు కనిపిస్తాయి. వాటి ఆధారంగా మీరు పరీక్షకు హాజరు కావచ్చు. ఈ లిస్టులో డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు జరిగే పరీక్షలకు హాజరు కావలసిన అభ్యర్థులు సమాచారం మాత్రమే ఉంది.
✅ Download Candidates Exam Dates List – Click here
