AP Kaushalam Exam Portal : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కౌన్సిలం అనే కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిరుద్యోగులు వివరాలను తెలుసుకునేందుకు ఇప్పటికే కౌశలం సర్వేను నిర్వహించడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే లక్ష్యంతో ప్రస్తుత ప్రభుత్వం కౌశలం సర్వే నిర్వహించిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియలో భాగంగా డిసెంబర్ రెండవ తేదీ నుంచి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.
గ్రామ , వార్డు సచివాలయ సిబ్బంది నిర్వహించిన కౌన్సిలింగ్ సర్వేలో నమోదు చేసుకున్నవారు https://www.kaushalam.ap.gov.in వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ మరియు ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవడం వల్ల వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి.
రాష్ట్రంలోని యువతకు కౌశలం పోర్టల్ అనేది ఉద్యోగాలు, నైపుణ్యాలు, కెరీర్ అభివృద్ధి మూడు ప్రయోజనాలను ఒకే వేదికలో అందిస్తోంది. ఇది పూర్తిగా పారదర్శకమైన, మోసాలకు అవకాశం లేని, ఉచిత ప్రభుత్వ ప్లాట్ఫారం. మీరు గ్రాడ్యుయేట్ అయితే వెంటనే రిజిస్ట్రేషన్ మరియు ప్రొఫైల్ అప్డేట్ కౌశలం పోర్టల్ లో చేసుకోండి. దీనికోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.
ఈ ఆర్టికల్ ద్వారా మీరు కౌశలం పోర్టల్ ఏమిటి? ఎలా రిజిస్టర్ కావాలి? ఏ అసెస్మెంట్లు ఉంటాయి? ఉద్యోగం దొరికిన తర్వాత ఏం చేయాలి? వంటి అన్ని వివరాలను సులభమైన తెలుగులో తెలుసుకుంటారు.
ఏపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు – Click here
Table of Contents :
కౌశలం పోర్టల్(Kaushalam) – ఆంధ్రప్రదేశ్ యువత కెరీర్ అభివృద్ధికి కొత్త దారి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన “కౌశలం” అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు రాష్ట్రంలోని లక్షలాది మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాల కోసం శక్తివంతమైన వేదికగా మారింది. ఇది పూర్తిగా ఉచితమైన, పారదర్శకమైన, నైపుణ్య ఆధారిత ఎంప్లాయబిలిటీ ప్రోగ్రామ్ గా చెప్పవచ్చు..
కౌశలం (Kaushalam) అంటే ఏమిటి?
కౌశలం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ IT శాఖ ప్రారంభించిన ఒక ఉద్యోగ నైపుణ్య మరియు కెరీర్ అభివృద్ధి కార్యక్రమం. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా:
1) యువత నైపుణ్యాలు పరీక్షించబడతాయి
2) వ్యక్తిగత లెర్నింగ్ సూచనలు ఇస్తారు
3) ధృవీకరించిన ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు
4) IT, ITES, GCCs మరియు ఇతర రంగాలలో ఉద్యోగాలు లభిస్తాయి
ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కంపెనీలు కూడా ప్రి-వెరిఫైడ్ స్కిల్ డేటా ఆధారంగా అభ్యర్థులను నియమించుకునే అవకాశం పొందుతాయి.
కౌశలం పోర్టల్ (Kaushalam) లో రిజిస్ట్రేషన్ ఎలా?
కౌశలంలో రిజిస్టర్ కావడం చాలా సులభం. స్టెప్-బై-స్టెప్‌గా చూద్దాం:
1) అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి: https://www.kaushalam.ap.gov.in
2) Register → For Graduates క్లిక్ చేయండి
3) GSWS సర్వేలో నమోదు చేసిన ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి
4) ఆధార్‌తో లింక్ అయిన ఇమెయిల్, మొబైల్ వెరిఫై చేయండి
పాస్వర్డ్ క్రియేట్ చేయండి
5)ఇమెయిల్ వెరిఫికేషన్ పూర్తి చేయండి
6)OTP ద్వారా KYC వెరిఫై చేయండి
7)విజయవంతమైన వెరిఫికేషన్ తర్వాత డాష్‌బోర్డ్‌లో Verified స్టేటస్ కనిపిస్తుంది
8)ఆధార్ డేటా GSWS సర్వేతో సరిపోలకపోతే, ముందు సర్వే పూర్తి చేసి 24 గంటల తర్వాత తిరిగి ప్రయత్నించాలి.
మొదటి లాగిన్ తర్వాత కనిపించే డాష్‌బోర్డ్
1) లాగిన్ అయిన వెంటనే అభ్యర్థి డాష్‌బోర్డ్‌లో:
2) ప్రొఫైల్ కంప్లీషన్ తెలుస్తుంది.
3) వెరిఫికేషన్ స్టేటస్ చూపిస్తుంది
4) అసెస్మెంట్స్ రాయవచ్చు.
5) ఉద్యోగ రికమండేషన్స్ పొందవచ్చు.
6) కోర్సులు నేర్చుకోవచ్చు.
7) Resume డౌన్లోడ్ చేసుకోవచ్చు
8)లీడర్‌బోర్డ్ పాయింట్స్ వంటి అన్ని వివరాలు చూడవచ్చు.
Readiness Survey అంటే ఏమిటి?
మొదటి లాగిన్‌లో తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన సర్వే ఇది. ఇందులో క్రింది ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ సరైన లేదా తప్పు సమాధానాలు ఉండవు.
1) వెంటనే ఉద్యోగానికి సిద్ధమా?
2) మీ అత్యవసరం
3) మీకు ఇష్టమైన ఉద్యోగ ప్రిఫరెన్స్ ఇవ్వాలి.
మీ ప్రొఫైల్ ఎలా పూర్తి చేయాలి?
ప్రొఫైల్‌లోని వివరాలు ఎంత ఖచ్చితంగా ఉంటే, అంత మంచి ఉద్యోగ రికమండేషన్స్ వస్తాయి. ఇందులో Basic Information, Education Details, Work Experience, Certifications, Projects వివరాలు తెలియజేయాలి.
అసెస్మెంట్కు 48 గంటలు ముందు వరకు మాత్రమే ప్రొఫైల్ ఎడిట్ చేయవచ్చు. RESUME ఆటోమేటిక్‌గా రూపొందుతుంది.
కౌశలం అసెస్మెంట్స్ – తప్పనిసరి రెండు పరీక్షలు :
ప్రతి అభ్యర్థి రెండు పరీక్షలు తప్పనిసరిగా రాయాలి:
A. Skill Assessment – 45 minutes
ఇందులో క్రింది సిలబస్ నుండి ప్రశ్నలు అడుగుతారు.
- Quantitative Aptitude
- Verbal & Logical Reasoning
- Data Interpretation
- Psychometric Evaluation
- Personalized Technical Questions
B. Communication Skill Assessment – 15 minutes
ఇందులో 3 ప్రశ్నలు ఉంటాయి.
- ఒక్కో ప్రశ్నకు 30 seconds మాట్లాడాలి. CEFR ఆధారంగా ఇంగ్లిష్ కమ్యూనికేషన్ అంచనా వేస్తారు
- రెండు అసెస్మెంట్లు proctored & recorded మోడ్‌లో జరుగుతాయి.
అసెస్మెంట్ రూల్స్ :
పరీక్ష ప్రారంభించే ముందు:
1) Camera on
2) Microphone on
3) Full-screen mode
4) Location access
కౌశలం పరీక్ష నిబంధనలు:
1) కేటాయించిన సెంటర్లోనే పరీక్ష రాయాలి
2) కెమెరాలో ఒక్క ముఖం మాత్రమే కనిపించాలి
3) Tabs మారిస్తే లేదా full-screen వదిలితే 3వ సారి పరీక్ష రద్దు అవుతుంది
అసెస్మెంట్ కోసం సిస్టమ్ అవసరాలు
పరీక్షకు ముందు మీ సిస్టమ్ ఇలా ఉండాలి:
- Desktop/Laptop తప్పనిసరి
- స్థిరమైన ఇంటర్నెట్: 3 Mbps download / 2 Mbps upload
- Updated Chrome / Edge బ్రౌజర్
- పనిచేసే Webcam, Mic
- Quiet & Well-lit రూమ్
- Power supply ఉండాలి.
- సిస్టమ్ టైం సరిగ్గా ఉండాలి
- ఇంటర్నెట్ పోయినా, పవర్ కట్ అయినా పరీక్ష ఆటోమేటిక్‌గా సేవ్ అవుతుంది.
ఉద్యోగం వచ్చిన తర్వాత – “I’m Placed” ఫీచర్ :
మీకు ఉద్యోగం వచ్చాక ఈ క్రింది వివరాలు తెలియజేయాలి.
Dashboard → Mark My Employment Status
Company name
Designation
Joining date
Offer letter upload
వీటిని సబ్మిట్ చేసిన తర్వాత స్టేటస్ Placed గా చూపిస్తుంది. 30 రోజులు ఈ స్టేటస్ మార్చలేరు.
Leaderboard & Learning Progress
కౌశలం గేమిఫికేషన్ ద్వారా పాయింట్లు ఇస్తుంది:
- మీరు Daily login చేస్తే 10 points వస్తాయి.
- మీరు Courses complete చేస్తే 100 points వస్తాయి.
- Assessments complete చేస్తే 150 points వస్తాయి.
- మీ Rank, Points, Activity streak వివరాలు చూడవచ్చు. LinkedIn కోసం షేర్ చేయగలిగే సర్టిఫికేట్ కూడా అందుబాటులో ఉంటుంది.
Safety & Fraud Prevention :
- కౌశలం పూర్తిగా ఉచితమైంది. ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మొద్దు. ఎవరికి డబ్బులు చెల్లించవద్దు.
- అధికారిక సమాచారము ఎప్పుడూ Verified SMS, Email, WhatsApp channels నుండి వస్తుంది.
సహాయం / సపోర్ట్ కోసం క్రింది వాటిని సంప్రదించండి :
ఎలాంటి సమస్య వచ్చినా:
📞 +91 78297 72255 📧 kaushalam@ap.gov.in
