Koushalam Exam Syllabus Details : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహించిన కౌశలం సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్. ఉద్యోగాలు కల్పించే ప్రక్రియలో భాగంగా కౌశలం సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకున్న అందరికీ డిసెంబర్ రెండవ తేదీ నుండి పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన కంప్యూటర్స్ తో పాటు హెడ్ ట్ మరియు కెమెరా వంటి పరికరాలను అన్ని సచివాలయాలకు అందించారు.
డిసెంబర్ రెండవ తేదీ నుంచి సర్వేలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పరీక్షలు జరగబోతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే కొంతమంది అభ్యర్థులకు పరీక్షకు సంబంధించిన తేదీ, సమయం వంటి వివరాలతో టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్, మరియు మెయిల్స్ వంటివి పంపిస్తున్నారు.
✅ విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click link
Table of Contents :
పరీక్షలు ఎక్కడ జరుగుతాయి ?
- ఈ పరీక్ష అభ్యర్థులకు సచివాలయాల్లో నిర్వహిస్తారు.
పరీక్ష విధానం వివరాలు :
- పరీక్ష మొత్తం ఒక గంట ఉంటుంది. ఇందులో 45 నిమిషాలు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ లో అర్థమెటిక్ మరియు రీజనింగ్ , ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
- 15 నిమిషాలు కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది. ఇందులో మూడు ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలకు మాట్లాడుతూ సమాధానం చెప్పాలి.
పరీక్ష రాసే అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు :
- ఈ పరీక్ష రాసే అభ్యర్థులు ఇప్పటివరకు తెలిసిన పాటర్న్ ప్రకారం పరీక్షకు ప్రిపేర్ అవ్వండి.
- పరీక్ష కేంద్రంలో మాత్రమే మీరు పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది.
- పరీక్ష రాసే సమయంలో మీ ముఖం మాత్రమే కెమెరా లో కనిపించాలి.
- పరీక్ష రాసే సమయంలో కంప్యూటర్ లో Tabs మారిస్తే పరీక్ష క్యాన్సిల్ అవుతుంది.
✅ Click here for Koushalam survey Registration
