RRB Group D New Exam Dates Announced | Railway Group D Exam Dates

RRB Group D Hall Tickets Download
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

RRB Group D New Exam Dates 2025 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్-డీ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు కోసం కొత్తగా షెడ్యూల్ విడుదలైంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ పరీక్షలను 2025 నవంబర్ 27 నుంచి 2026 జనవరి 16 వరకు నిర్వహించనున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే నియామక ప్రక్రియకు సంబంధించిన కోర్టు కేసు కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. గత వారం కోర్టు ఉత్తర్వులు జారీచేసిన తర్వాత తాజాగా నూతన తేదీలను ఖరారు చేశారు.

పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డ్స్ విడుదల : ( Download RRB Group D Hall Tickets)
ఈ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు.. పరీక్ష రాయాల్సిన నగరం, తేదీ వంటి ప్రాథమిక సమాచారాన్ని బుధవారం నుంచి అందుబాటులో ఉంచనున్నట్టు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించింది. ఇందులో సిటీ స్లిప్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సంబంధిత ఉచిత ప్రయాణ అథారిటినీ డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుకల్పిస్తున్నట్టు తెలిపింది. అయితే.. అడ్మిట్ కార్డులు మాత్రం పరీక్షకు నాలుగు రోజుల ముందు జారీ చేస్తామని స్పష్టం చేసింది. అంటే నవంబర్ 27న పరీక్ష రాయాల్సిన అభ్యర్థులు నవంబర్ 23 లేదా 24 తేదీల్లో సంబంధిత హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *