Federal Bank Officer Sales & Client Acquisition (Scale-1) Recruitment 2025 : ప్రముఖ బ్యాంక్ అయిన ఫెడరల్ బ్యాంక్ నుండి ఆఫీసర్ – సేల్స్ & క్లయింట్ అక్విజిషన్ (స్కేల్ I) ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో అక్టోబర్ 27వ తేది లోపు అప్లై చేయాలి.. ఎంపికైన వారికి నెలకు 84,500/- జీతము ఇస్తారు.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు అన్ని తెలుసుకొని అర్హత ఉన్న వారు అప్లై చేయండి..
Table of Contents :
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ బ్యాంక్ అయిన ఫెడరల్ బ్యాంక్ నుండి విడుదల అయ్యింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- ఆఫీసర్ – సేల్స్ & క్లయింట్ అక్విజిషన్ (స్కేల్ I) అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
- మొత్తం ఖాళీలు సంఖ్య వివరాలు నోటిఫికేషన్ లో తెలుపలేదు.
అర్హతలు :
- అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- అభ్యర్థులకు తప్పనిసరిగా పదో తరగతి, ఇంటర్ లేదా డిప్లమో, డిగ్రీ మరియు పీజీ లో కనీస 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
వయస్సు వివరాలు :
- అభ్యర్థులకు 01-10-2025 తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలి.
- BFSI సెక్టార్ లో ఒక సంవత్సరం అనుభవం ఉన్నవారికి 28 సంవత్సరాలు వరకు వయస్సు ఉన్న అర్హత కలిగి ఉంటారు.
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 32 సంవత్సరాల వరకు వయసు ఉన్న అప్లై చేయవచ్చు.
జీతము వివరాలు :
- ఎంపికైన అభ్యర్థులకు అన్ని రకాల అలవెన్స్లు కలుపుకొని నెలకు 84,500/- జీతం ఇస్తారు.
శిక్షణ కాలం :
- ఎంపికైన అభ్యర్థులకు రెండు సంవత్సరాలు పాటు ప్రొభేషన్ పీరియడ్ ఉంటుంది.
అప్లై చేయు విధానం :
- ఫెడరల్ బ్యాంకు భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
అప్లికేషన్ తేదీలు :
- అక్టోబర్ 15వ తేదీ నుండి అక్టోబర్ 27వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
ఎంపిక విధానం వివరాలు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
పరీక్ష తేదీ :
- అప్లై చేసిన అభ్యర్థులకు నవంబర్ 16వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు.
- పరీక్షలో 100 ప్రశ్నలు వంద మార్కులు ఇస్తారు. 75 నిమిషాల సమయం ఇస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు :
- దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
- తెలుగు రాష్ట్రాల్లో అనంతపూర్, విజయవాడ, విశాఖపట్నం మరియు హైదరాబాద్ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ఎస్సీ మరియు ఎస్టీ రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 160/- రూపాయలు.
- జనరల్ మరియు ఇతర అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 800/- రూపాయలు
- అభ్యర్థులు 18% జీఎస్టీ అదనంగా చెల్లించాలి.
✅ Download Notification – Click here
✅ Official Website – Click here