DRDO Research Centre Imarat Apprentice Notification 2025 : హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా గల భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలోగల డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క సంస్థ రీసెర్చ్ సెంటర్ ఇమరత్ , డాక్టర్ ఏ పి జె అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్ సంస్థ నుండి ఒక సంవత్సరం కాల పరిమితి తో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 195 అప్రెంటిస్ ( గ్రాడ్యుయేట్ , డిప్లొమా , ఐటిఐ ) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు అనగా అవసరము విద్యార్హతలు ఏమిటి ? దరఖాస్తు విధానం ఏ విధంగా ఉంటుంది ? ఎంపిక విధానం ఏమిటి ? ఏ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి మొదలగు విషయాలు ను ఈ ఆర్టికల్ లో తెలియజేయడం జరిగింది.
Table of Contents :
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- డాక్టర్ ఏ పి జె అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్ సంస్థ యొక్క రీసెర్చ్ సెంటర్ ఇమరత్ నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- అప్రెంటిస్ ( గ్రాడ్యుయేట్ , డిప్లొమా , ఐటిఐ ) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం 195 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 40
- టెక్నీషియన్ అప్రెంటిస్ ( డిప్లొమా ) – 20
- ట్రేడ్ అప్రెంటిస్ ( ITI ) – 135
🔥 వయస్సు :
- 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
- వయస్సు నిర్ధారణ కొరకు 01/09/2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
🔥 విద్యార్హత :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : ECE, EEE , CSE , Mechanical , Chemical విభాగాలలో B.E / B.Tech ఉత్తీర్ణత సాధించాలి.
- టెక్నీషియన్ అప్రెంటిస్ ( డిప్లొమా ) : ECE, EEE , CSE , Mechanical , Chemical విభాగాలలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
- ట్రేడ్ అప్రెంటిస్ : ఫిట్టర్ , వెల్డర్ , టర్నర్ , మిషనిస్ట్, మెకానిక్ డీసెల్, డ్రాఫ్ట్ మెన్ ( మెకానికల్ ) , ఎలెక్ట్రానిక్ మెకానిక్ , ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్ , లైబ్రరీ అసిస్టెంట్ అండ్ COPA వంటి విభాగాలలో ఐటిఐ ఉత్తీర్ణత సాధించాలి.
🔥 దరఖాస్తు చేయు విధానము :
- గ్రాడ్యుయేట్ & డిప్లొమా అప్రెంటిస్ అభ్యర్థులు NATS పోర్టల్ లో మరియు ITI అభ్యర్థులు అప్రెంటిస్షిప్ ఇండియా వెబ్సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 28 వరకు అవకాశం కల్పించారు.
🔥 ఎంపిక విధానం :
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి , విద్యార్హత లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అవసరం అనుకుంటే ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు.
🔥 స్టైఫండ్ :
- ఎంపికయిన వారికి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు స్టైఫండ్ లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 28/10/2025
👉 Click here to apply graduate & Technician apprentice
👉 Click here to apply Trade apprentice
👉 Click here for official website