టాటా మెమోరియల్ హాస్పిటల్ నుండి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక Advt.No.TMC/AD/123/2025 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో ఫిమేల్ నర్స్ ‘ఏ’ మరియు నర్స్ ‘ఏ’ అనే ఉద్యోగాలు కూడా భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 16వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉండే స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన టాటా మెమోరియల్ సెంటర్ నుండి విడుదల కావడం జరిగింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిమేల్ నర్స్ ‘ఏ’ మరియు నర్స్ ‘ఏ’ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
- ఫిమేల్ నర్స్ ‘ఏ’ మరియు నర్స్ ‘ఏ’ అనే పోస్టులు మొత్తం 222 ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
జీతం వివరాలు :
- ఎంపికైన వారికి నెలకు 44,900/- జీతంతో పాటు ఇతర చాలా రకాల అలవెన్స్ లు మరియు బెనిఫిట్స్ ఇస్తారు.
ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు :
- క్రింది తెలిపిన విధంగా పోస్టులను అనుసరించి విద్యార్హతలు ఉండాలి.
అప్లికేషన్ విధానము :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ఆన్లైన్ విధానములో అప్లై చేయాలి.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
- SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
- మిగతావారు అప్లికేషన్ ఫీజు 300/- రూపాయలు చెల్లించాలి..
అప్లికేషన్ తేదీలు :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు అక్టోబర్ 16వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీ లోపు ఆన్లైన్లో అప్లై చేయాలి.
వయస్సు వివరాలు :
- నవంబర్ 14 – 2025 తేదీ నాటికి వయసు 30 సంవత్సరాలు లోపు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
వయసులో సడలింపు వివరాలు :
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
- ఓబీసీ అభ్యర్థులకు వయస్సులో మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.
- PWD అభ్యర్థులకు వయస్సులో అదనంగా పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
గమనిక
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు క్రింది ఇచ్చిన లింకు పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
✅ Download Notification – Click here