మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలోని భారత ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ( BEL ) సంస్థ నుండి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ & టెక్నీషియన్ సి ఉద్యోగాల భర్తీ కొరకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ ఉద్యోగాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? విద్యార్హత ఏమిటి ? ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది. వయోపరిమితి ఎంత ఉండాలి ? వంటి వివిధ అంశాల సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
Table of Contents :
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ( BEL ) సంస్థ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ & టెక్నీషియన్ సి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ :
- 1. ఎలక్ట్రానిక్స్ – 03
- 2. మెకానికల్ – 02
- టెక్నీషియన్ సి :
- 1. ఎలెక్ట్రానిక్ మెకానిక్ – 08
- 2. ఫిట్టర్ – 02
🔥 వయోపరిమితి :
- ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు & ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు లభిస్తుంది.
🔥 విద్యార్హత :
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ : గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- టెక్నీషియన్ సి : పదవ తరగతి మరియు సంబంధిత విభాగంలో ITI ఉత్తీర్ణత సాధించి , ఒక సంవత్సరం అప్రెంటిస్ పూర్తి చేసి ఉండాలి.
- అభ్యర్థులు హర్యానా ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్ నందు రిజిస్టర్ చేసుకొని వుండాలి.
🔥 దరఖాస్తు విధానము :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్లో 05 /11/ 2025 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
🔥 దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ , ఎస్టీ , దివ్యాంగులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు లభిస్తుంది.
- మిగతా అందరూ అభ్యర్థులు 590 రూపాయలు దరఖాస్తు ఫీజు ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాలి.
🔥 ఎంపిక విధానం :
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి , కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ను నవంబర్ / డిసెంబర్ 2025 లో నిర్వహిస్తారు.
🔥 జీతభత్యాలు :
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ గా ఎంపిక అయిన వారికి నెలకు 90,000 రూపాయల వరకు జీతం లభిస్తుంది.
- టెక్నిషియన్ గా ఎంపిక అయిన వారికి నెలకు 82,000 రూపాయల వరకు జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 05/11/2025