ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం , ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి వుమెన్ & చైల్డ్ వెల్ఫేర్ & ఎంపవర్మెంట్ ఆఫీసర్ , NTR జిల్లా నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 రకాల ఉద్యోగాలను , కాంట్రాక్ట్ / అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన మొత్తం 20 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ కి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? అవసరమగు విద్యార్హతలు ఏమిటి ? ఎంత వయస్సు లోపు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు ? జీతం ఎంత లభిస్తుంది ? మొదలగు అన్ని వివరాల సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
Table of Contents :
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- డిస్ట్రిక్ట్ వుమెన్ & చైల్డ్ వెల్ఫేర్ & ఎంపవర్మెంట్ ఆఫీసర్ , NTR జిల్లా వారి కార్యాలయం నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా అవుట్సోర్సింగ్ / కాంట్రాక్ట్ ప్రాధిపతికన వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య :
మొత్తం 20 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
- అకౌంటెంట్ – 01
- అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ – 01
- డాక్టర్ ( పార్ట్ టైం ) – 01
- ఆయా – 06
- చౌకిదార్ ( వాచ్ మెన్ ) – 01
- ఎడ్యుకేటర్ ( పార్ట్ టైం ) – 01
- ఆర్ట్ & క్రాఫ్ట్ – కం మ్యూజిక్ టీచర్ ( పార్ట్ టైం ) – 02
- PT ఇన్స్ట్రక్టర్ కం యోగా టీచర్ ( పార్ట్ టైం ) – 02
- కుక్ – 01
- హెల్పర్ – 01
- హౌస్ కీపర్ – 02
- హెల్పర్ కం నైట్ వాచ్ మెన్ – 01
🔥 వయో పరిమితి :
- 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు లోపు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు నిర్ధారణ కొరకు 01/07/2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
- ఎస్సీ , ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు లభిస్తుంది.
- దివ్యాంగులకు 10 సంవత్సరాల వయసడలింపు లభిస్తుంది.
🔥 విద్యార్హతలు :
- 1. అకౌంటెంట్ : గుర్తింపు పొందిన సంస్థ నుండి గణితం లేదా కామర్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండి , పని అనుభవం తప్పనిసరి తప్పనిసరిగా ఉండాలి.
- 2. అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ : గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుండి 12వ తరగతి ఉత్తీర్ణత అయ్యి. కంప్యూటర్ డిప్లొమా/సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. మరియు పని అనుభవానికి వెయిటేజ్ ఉంటుంది. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి వుండాలి.
- 3. వైద్యులు (పార్ట్ టైమ్) (మహిళలకు మాత్రమే) : ఎంబీబీఎస్ పూర్తిచేసి, పీడియాట్రిక్ మెడిసిన్‌లో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. అత్యవసర సేవలందించే సామర్థ్యం ఉండాలి.
- 4. ఆయా (మహిళలకు మాత్రమే) : SSC ఉత్తీర్ణత / ఫెయిల్ అయి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. స్థానికంగా ఉన్న వారికి అవకాశం లభిస్తుంది.
- 5. చౌకీదార్ (వాచ్ మాన్ – మహిళలకు మాత్రమే) : SSC ఉత్తీర్ణత / ఫెయిల్ అయి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. స్థానికంగా ఉన్న వారికి అవకాశం లభిస్తుంది.
- 6. ఎడ్యుకేటర్ (పార్ట్ టైమ్) (మహిళలకు మాత్రమే) :
- బీఈడీతో పాటు ఏదైనా డిగ్రీ/పీజీ ఉత్తీర్ణత సాధించాలి మరియు చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో కనీసం 2 సంవత్సరాల బోధనా అనుభవం , కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.స్థానికంగా ఉన్న వారికి అవకాశం లభిస్తుంది.
- 7. ఆర్ట్ & క్రాఫ్ట్ మరియు మ్యూజిక్ టీచర్ (పార్ట్ టైమ్) (మహిళలకు మాత్రమే) : ఆర్ట్/మ్యూజిక్ సంబంధిత కోర్సుతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి , చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో 2 సంవత్సరాల అనుభవం మరియు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. స్థానికంగా ఉన్న వారికి అవకాశం లభిస్తుంది.
- 8. ఫిజికల్ ట్రైనర్ (యోగ టీచర్ – పార్ట్ టైమ్) (మహిళలకు మాత్రమే) : యోగ/ఫిజికల్ ట్రైనింగ్ సంబంధిత కోర్సుతో డిగ్రీ మరియు చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో 2 సంవత్సరాల అనుభవం ఉండి, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి గా ఉండాలి. స్థానికంగా ఉన్న వారికి అవకాశం లభిస్తుంది.
- 9. కుక్ (ఔట్ సోర్సింగ్ బేసిస్) (మహిళలకు మాత్రమే) : SSC ఉత్తీర్ణత లేదా ఫెయిల్ అయి ఉండి , చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో వంట అనుభవం కలిగి వుండాలి.
- 10. హెల్పర్ : ఔట్ సోర్సింగ్ బేసిస్ – మహిళలకు మాత్రమే : SSC ఉత్తీర్ణత మరియు ఫెయిల్ అయినా మంచి ప్రవర్తన కలిగి వుండాలి. స్థానికంగా ఉన్న వారికి అవకాశం లభిస్తుంది.
- 11. హౌస్ కీపర్ (ఔట్ సోర్సింగ్ బేసిస్) (మహిళలకు మాత్రమే) : SSC ఉత్తీర్ణత లేదా ఫెయిల్ అయినా మంచి ప్రవర్తన కలిగి , స్థానికంగా ఉన్న వారికి అవకాశం లభిస్తుంది.
- 12. సహాయకురాలు cum నైట్ వాచ్‌వుమన్ (ఔట్ సోర్సింగ్ బేసిస్) (మహిళలకు మాత్రమే) : SSC ఉత్తీర్ణత లేదా ఫెయిల్ అయినా సరే ,మంచి ప్రవర్తన కలిగి , స్థానికంగా ఉన్న వారికి అవకాశం లభిస్తుంది.
🔥 దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ లో ప్రస్తావించిన దరఖాస్తు ఫారం ను ప్రింట్ తీసుకొని , ఫిల్ చేసి సంబంధిత ధ్రువపత్రాలు విద్యార్హత సర్టిఫికెట్లు , మార్క్స్ మెమోలు , ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ , కాస్ట్ సర్టిఫికెట్ మొదలగునవి ( గెజిటెడ్ అధికారి ద్వారా ఆటస్టు చేసి ) జత చేసి కార్యాలయ చిరునామాకు నేరుగా అందించాలి.
- దరఖాస్తు చేసుకోవడానికి 13/10/2025 నుండి 22/10/2025 సాయంత్రం 05:00 గంటల వరకు అవకాశం కల్పించారు.
🔥 దరఖాస్తు పంపించవలసిన చిరునామా :
- District women & child welfare & empowerment officer , Door no : 31-4-29A Gadde purna chandra rao road , maruthi nagar , 2 nd line vijayawada , NTR district.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల కొరకు వచ్చిన దరఖాస్తులను ముందుగా షార్ట్ లిస్టు చేస్తారు. షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు
🔥 జీతం :
- అకౌంటెంట్ ఉద్యోగాలకు ఎంపిక అయిన నెలకు వారికి 18,536 /- జీతం లభిస్తుంది.
- అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గా ఎంపిన అయిన వారికి నెలకు 13,240 /- రూపాయలు జీతం లభిస్తుంది.
- ఎడ్యుకేటర్ , ఆర్ట్ & క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్ , PT ఇన్స్ట్రక్టర్ కం యోగా టీచర్ గా ఎంపిక అయిన వారికి నెలకు 10,000 రూపాయలు జీతం లభిస్తుంది.
- డాక్టర్ ( పార్ట్ టైం ) , కుక్ గా ఎంపిక అయిన వారికి నెలకు 9930 /- రూపాయల జీతం లభిస్తుంది.
- ఆయా , చౌకిదార్ , హెల్పర్, హౌస్ కీపర్ , హెల్పర్ కం నైట్ వాచ్ మాన్ గా ఎంపిక అయిన వారికి నెలకు 7944 రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ ::13/10/2025
- దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 22/10/2025 ( సాయంత్రం 05:00 గంటల లోగా )