దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సైనిక్ స్కూల్స్ లలో ప్రవేశాలు పొందేందుకు గాను నిర్వహించే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2026 అధికారిక నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సైనిక్ స్కూల్స్ లో ప్రవేశాల కొరకు బాలురు తో పాటు బాలికలు కూడా అర్హత కలిగి ఉంటారు.
ప్రస్తుత విద్యా సంవత్సరం లో 5 వ తరగతి మరియు 8 వ తరగతి చదువుతున్న విద్యార్థులు తదుపరి విద్యా సంవత్సరం లో సైనిక్ స్కూల్స్ జాయిన్ అయ్యేందుకు ఈ నోటిఫికేషన్ ద్వారా అవకాశం కల్పించారు.
ఈ సైనిక్ స్కూల్ లో ప్రవేశాలు పొందేందుకు గాను దరఖాస్తు చేసుకొనేందుకు చివరి తేదీ ఏమిటి ? దరఖాస్తు ఫీజు ఎంత చెల్లించాలి ? ఏ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి ? ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది ? మొదలగు పూర్తి వివరాల సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
Table of Contents :
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో గల సైనిక్ స్కూల్స్ సొసైటీ సంస్థ నుండి సైనిక్ స్కూల్స్ లో విద్య అభ్యసించేందుకు గాను అవకాశం కల్పిస్తూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 సైనిక్ స్కూల్స్ లో ప్రవేశాలను ఎవరికి కల్పిస్తారు ? :
- ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5వ తరగతి మరియు ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ AISSEE – 2026 దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కలిగి ఉంటారు.
- ఈ సైనిక్ స్కూల్ లలో బాలురు తో పాటుగా బాలికలు కూడా ప్రవేశం పొందేందుకు అర్హత కలిగి ఉన్నారు.
🔥 అవసరమగు వయస్సు :
- 6 వ తరగతి లో ప్రవేశం కొరకు : 12 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి. వయస్సు నిర్ధారణ కొరకు 31/03/2026 ను కటాఫ్ తేదీగా నిర్ణయించారు.
- 9 వ తరగతి లో ప్రవేశం కొరకు : 13 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి. వయస్సు నిర్ధారణ కొరకు 31/03/2026 ను కటాఫ్ తేదీగా నిర్ణయించారు.
🔥 దరఖాస్తు విధానం :
- అర్హత మరియు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు సమర్పించాలి.
- అక్టోబర్ 30వ తేదీలోగా దరఖాస్తు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ఫీజు చెల్లింపు కొరకు అక్టోబర్ 31 వరకు అవకాశం ఉంది.
🔥 దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ మరియు ఎస్టి అభ్యర్థులు 700 రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
- మిగతా అందరు అభ్యర్థులు 850 రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
🔥 ఎంపిక విధానము :
- OMR ఆధారిత రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 6 వ తరగతి లో ప్రవేశాల కొరకు వ్రాత పరీక్ష విధానం :
- ఆరవ తరగతిలో ప్రవేశాలు పొందింది గాను నిర్వహించే పరీక్షలో భాగంగా మొత్తం 125 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 300 మార్కులు కేటాయించారు. విభాగాల వారీగా లాంగ్వేజ్ , ఇంటిలిజెన్స్ , జనరల్ నాలెడ్జ్ విభాగాల నుండి ఒక్కొక్క విభాగం నుండి 25 ప్రశ్నలు కి , ప్రతి ప్రశ్నకి రెండు మార్కులు చొప్పున కేటాయించారు. మ్యాథమెటిక్స్ విభాగం నుండి 50 ప్రశ్నలకు గాను 150 మార్కులు అనగా ఒక్కొక్క ప్రశ్నకు మూడు మార్కులు కేటాయించారు.
- పరీక్ష కొరకు 150 నిముషాల సమయం కేటాయించారు. మధ్యాహ్నం 02:00 గంటల నుండి 04:30 వరకు పరీక్ష నిర్వహిస్తారు.
🔥 9 వ తరగతి లో ప్రవేశాల కొరకు వ్రాత పరీక్షా విధానం :
- ఈ పరీక్ష లో మొత్తం 05 విభాగాలు ఉంటాయి. మొత్తం 150 ప్రశ్నలకు గాను 400 మార్కులు కేటాయించారు.
- ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్ , ఇంగ్లీష్ , జనరల్ సైన్స్ , సోషల్ సైన్స్ విభాగాల నుండి 25 ప్రశ్నలు చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. మాథెమాటిక్స్ విభాగం నుండి 50 ప్రశ్నలకు , ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 200 మార్కులు కేటాయించారు.
- ఈ పరిక్ష నిర్వహణ కొరకు మొత్తం 180 నిముషాలు కేటాయించారు. మధ్యాహ్నం 02:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
🔥 వ్రాత పరీక్ష మాధ్యమం :
- 9 వ తరగతి లో ప్రవేశం పొందేందుకు పరీక్ష ను కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే నిర్వహిస్తారు
- 6 వ తరగతి లో ప్రవేశం కొరకు వ్రాత పరీక్ష ను ఇంగ్లీష్ , తెలుగు హిందీ , గుజరాతీ , మలయాళం , మరాఠీ , అస్సామీ , ఒడియా , పంజాబీ , కన్నడ , బెంగాలీ , తమిళ్ , ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు.
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 10/10/2025
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 30/10/2025 ( సాయంత్రం 05:00 గంటల వరకు )
- ఆన్లైన్ విధానం ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : 31/10/2025 ( రాత్రి 11:50 లోపుగా )
- సమర్పించిన దరఖాస్తు లో వివరాలు మార్పు కొరకు అవకాశం : 02/11/2025 నుండి 04/11/2025
- పరీక్ష నిర్వహణ : జనవరి 2026