APPSC Forest Beat Officer Results 2025 Released : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మరియు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2025 సంవత్సరంలో జూలై 14 వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు జూలై 22వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమ్స్ రాత పరీక్షను సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం నిర్వహించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమ్స్ రాత పరీక్షను సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం నిర్వహించారు.
ఈ ఫలితాలను అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో విడుదల చేసిన రిజల్ట్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రిజల్ట్ నోటిఫికేషన్ లో మెయిన్స్ పరీక్షకు క్వాలిఫై అయిన అభ్యర్థుల రిజిస్టర్డ్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఈ లిస్టులో రిజిస్టర్డ్ నెంబర్ ఉన్న అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు సిద్ధం కావాలి.
ఏపీపీఎస్సీ విడుదల చేసిన వెబ్ నోట్ మరియు ప్రజెంట్ నోటిఫికేషన్ లో కటాఫ్ మార్కులు మరియు పరీక్ష తేదీలు ప్రకటించలేదు..
అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పైన క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ నుండి వెబ్ నోట్ మరియు మెన్స్ కు ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు..
✅ Official Website – Click here
