APTWRIS Counsellor Notification 2025 : ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ( APTWREIS ) సంస్థ నుండి గురుకులాల్లో పనిచేసేందుకు గాను 28 కౌన్సిలర్ ఉద్యోగాలు భర్తీ కొరకు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నోటిఫికేషన్ జారీ కాబడింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎంపిక కాబడిన అభ్యర్థులు మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నందు పని చేయాల్సి వుంటుంది. ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకునేందుకుగాను ఎవరు అర్హులు ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? జీతభత్యాలు ఎంత లభిస్తాయి ? దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి ? వంటి అన్ని అంశాల సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
Table of Contents :
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (APTWREIS) నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా కౌన్సిలర్ ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ ప్రాదిపాదికన భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం 28 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నందు పనిచేయాల్సి ఉంటుంది.
🔥 విద్యార్హత :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సైకాలజీ లేదా క్లినికల్ సైకాలజీ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఒక సంవత్సరం పాటు గైడెన్స్ మరియు కౌన్సిలింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- 8 వ తరగతి వరకు కచ్చితంగా తెలుగును అభ్యసించి ఉండాలి.
🔥 దరఖాస్తు విధానం :
- అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు వారి యొక్క CV ( curriculam vitae) ను అధికారిక మెయిల్ ఐడి : emrsgurukulam@gmail.com కి పంపించాలి.
- తేదీ 17/10/2025 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
🔥 రెమ్యూనరేషన్ :
- కౌన్సిలర్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి నెలకు 35,400 రూపాయలు రెమ్యునరేషన్ ప్రతి నెలా లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు :
- నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ : 09/10/2025
- దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 17/10/2025
👉 Click here to download Notification
👉 Click here for official website