Adikavi Nannaya University Programmer Notification 2025 | Latest Jobs in Telugu

Adikavi Nannaya University Programmer Notification 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Adikavi Nannaya University Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆదికవి నన్నయ యూనివర్సిటీ నుండి ప్రోగ్రామర్ అనే ఉద్యోగాలను తాత్కాలిక లేదా షార్ట్ టర్మ్ కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది..

ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు అక్టోబర్ 15వ తేదీ లోపు అప్లై చేయాలి. ఎంపికైన వారికి నెలకు 35 వేల రూపాయలు జీతం ఇస్తారు. నోటిఫికేషన్ వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమహేంద్రవరంలో ఉన్న ఆదికవి నన్నయ యూనివర్సిటీ నుండి విడుదల చేయబడింది.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రోగ్రామర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

జీతము వివరాలు :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 35 వేల రూపాయలు జీతం ఇస్తారు.

అర్హతల వివరాలు :

కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మరియు మిషన్ లెర్నింగ్ లేదా కంప్యూటర్ అప్లికేషన్ స్పెషలైజేషన్స్ లో దిగువ తెలిపిన అర్హతలు ఉన్నవారు అర్హులు.

1) బిఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీ విద్యార్హతతో పాటు నాలుగు సంవత్సరాలు ఫుల్ స్టాక్ డెవలపర్ లేదా సాఫ్ట్వేర్ డెవలపర్ గా ప్రొఫెషనల్ అనుభవం ఉండాలి. (లేదా)

2) ఎంఈ లేదా ఎంటెక్ విద్యార్హతతో పాటు రెండు సంవత్సరాలు ఫుల్ స్టాక్ డెవలపర్ లేదా సాఫ్ట్వేర్ డెవలపర్ గా ప్రొఫెషనల్ అనుభవం ఉండాలి.

మొత్తం ఖాళీల సంఖ్య :

నోటిఫికేషన్ ద్వారా నాలుగు పోస్టులు భర్తీ చేస్తున్నారు.

వయస్సు వివరాలు :

వయసు 40 సంవత్సరాలు లోపు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.

అప్లై చేయడానికి చివరి తేదీ :

అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 15వ తేదీలోపు అప్లై చేయాలి.

అప్లికేషన్ పంపించాల్సిన లేదా అందజేయాల్సిన చేయాల్సిన చిరునామా :

To
The Registrar
Adikavi Nannaya University
Raja Raja Narendra Nagar
Rajamahendravaram-533296,
Andhra Pradesh, India.

ఎంపిక విధానము :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు :

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

గమనిక :

ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి..

DOWNLOAD NOTIFICATION – Click here

Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *