Dr NTR Vaidya Seva Trust Data Entry Operator Notification 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్నవారు త్వరగా అప్లై చేయండి..
✅ రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు – Click here
Table of Contents :
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ నోటిఫికేషన్ విజయనగరం జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కార్యాలయం నుండి విడుదలైంది..
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా విజయనగరం జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
భర్తీ చేస్తున్న మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం పది పోస్టులు భర్తీ చేస్తున్నారు.
జీతము వివరాలు :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రోజుకు 400 రూపాయలు చొప్పున గౌరవ వేతనం ఇస్తారు. గరిష్టంగా నెలకు 12 వేల రూపాయలు గౌరవ వేతనం చెల్లిస్తారు.
ఉండవలసిన విద్యార్హతలు :
ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పాసై , PGDCA కోర్స్ పూర్తి చేసిన వారు అర్హులు.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
డిగ్రీలో వచ్చిన మార్కులకు 75 శాతం, PGDCA కు 25% మార్కుల వెయిటేజీ ఇస్తారు.
అప్లికేషన్ విధానము :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ తో పాటు ఇచ్చిన అప్లికేషన్ నింపి అవసరమైన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు పైన సెల్ఫ్ అటిస్టేషన్ చేసి వాక్ ఇన్ ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాలి.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరిగే తేదీ మరియు ప్రదేశం :
అక్టోబర్ 13వ తేదీన ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. అర్హత ఉండే అభ్యర్థులు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం రెండు గంటల లోపు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం :
విజయనగరంలో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాన్ఫరెన్స్ హాల్ లో 13-10-2025 తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
అవసరమైన సర్టిఫికెట్స్ :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు సెల్ఫ్ అటెస్ట్ చేసిన జిరాక్స్ కాపీలతో వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
- పదో తరగతి మార్కుల మెమో
- డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ మార్కుల మెమో
- PGDCA మార్కుల మెమో
- ఆధార్ కార్డు
- 4వ తరగతి నుండి పదవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
✅ Download Notification – Click here
✅ Official Website – Click here
