ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ( DDA ) సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 26 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్ని విభాగాలలో కలిపి మొత్తం 1732 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇందులో భాగంగా MTS , మాలి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టంట్ , స్టెనోగ్రాఫర్ , సర్వేయర్ , సెక్షనల్ ఆఫీసర్ వంటి వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పోస్ట్ ల వారీగా ఖాళీల సంఖ్య ఎంత ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి ? దరఖాస్తు ఫీజు ఎంత చెల్లించాలి వంటి వివిధ అంశాల సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ విద్యా శాఖ & మున్సిపల్ శాఖల్లో 5346 ఉద్యోగాలు – Click here
Table of Contents :
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ రిక్రూట్మెంట్ సెల్ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా సంస్థ లో గ్రూప్ – A , గ్రూప్ – B , గ్రూప్ – C ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం 1732 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
- గ్రూప్ – సి ఉద్యోగాలు :
- 1. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 745
- 2. మాలీ – 282
- 3. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 199
- 4. పట్వారీ – 79
- 5. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – D – 44
- 6. సర్వేయర్ – 06
- 7.అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ – 06
- గ్రూప్ – బి ఉద్యోగాలు :
- 8. జూనియర్ ట్రాన్స్లేటర్ – 06
- 9. నాయబ్ తహసిల్దార్ – 06
- 10.సెక్షనల్ ఆఫీసర్ ( హార్టికల్చర్ ) – 75
- 11.జూనియర్ ఇంజనీర్ ( ఎలక్ట్రికల్ / మెకానికల్ ) – 67
- 12. జూనియర్ ఇంజనీర్ ( సివిల్ ) – 104
- 13. ప్రోగ్రామర్ – 06
- 14. ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్ – 09
- 15. ప్లానింగ్ అసిస్టెంట్ – 23
- 16. లీగల్ అసిస్టెంట్ – 07
- 17. అసిస్టెంట్ డైరెక్టర్ ( మినిస్టీరియల్ ) – 15
- 18. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( ఎలక్ట్రికల్ ) – 03
- 19.అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( సివిల్ ) – 10
- 20.అసిస్టెంట్ డైరెక్టర్ ( సిస్టమ్ ) – 03
- 21.అసిస్టెంట్ డైరెక్టర్ ( ల్యాండ్ స్కైప్ ) – 01
- 22. అసిస్టెంట్ డైరెక్టర్ ( ఆర్కిటెక్ట్ ) – 08
- 23.అసిస్టెంట్ డైరెక్టర్ ( ప్లానింగ్ ) – 19
- 24.డిప్యూటీ డైరెక్టర్ ( ప్లానింగ్ ) – 04
- 25.డిప్యూటీ డైరెక్టర్ ( పబ్లిక్ రిలేషన్ ) – 01
- 26. డిప్యూటీ డైరెక్టర్ ( ఆర్కిటెక్ట్ ) – 04
🔥 అవసరమగు వయస్సు :
- ఈ ఉద్యోగాలకు సంబంధించి , పోస్టును అనుసరించి 18 సంవత్సరాలు నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు , ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు , దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు కలదు.
🔥 విద్యార్హత :
- పోస్టులను అనుసరించి పదవ తరగతి , ఇంటర్మీడియట్ , డిగ్రీ , సంబంధిత విభాగాలలో డిప్లొమా , మాస్టర్స్ డిగ్రీ , ఇంజనీరింగ్ డిగ్రీ వంటి విద్యార్హతలు కలిగి వుండాలి.
🔥 దరఖాస్తు విధానం :
- అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 దరఖాస్తు ఫీజు :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనేందుకు గాను అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
- అన్ రిజర్వడ్, ఓబీసీ ( నాన్ క్రిమిలేయర్ ) , EWS అభ్యర్థులు 2,500 రూపాయలు చెల్లించాలి.
- మిగతా అందరు అభ్యర్థులు 1,500 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. వీరికి దరఖాస్తు ఫీజు రిఫండ్ చేయడం జరుగుతుంది.
🔥 ఎంపిక విధానం :
- పోస్ట్ లను అనుసరించి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
🔥 జీతభత్యాలు :
- పోస్టులను అనుసరించి వీరికి జీత భత్యాలు లభిస్తాయి.
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 06/10/2025 ( ఉదయం 10:00 గంటల నుండి )
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 05/11/2025 ( సాయంత్రం 06:00 గంటల లోపు )
- స్టేజ్ – 01 వ్రాత పరీక్ష నిర్వహణ : డిసెంబర్ 2025 లేదా జనవరి 2026
