RRB JE Notification 2025 Released | Railway JE Qualification, Age, Salary, Syllabus, Zone wise Vacancies

RRB JE Recruitment 2025 in Telugu
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

RRB JE Recruitment 2025 : ఇండియన్ రైల్వేలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీర్, కెమికల్ సూపర్వైజర్ & మెటలర్జికల్ అసిస్టెంట్ మరియు డిపో మేటీరియల్ సూపరింటెండెంట్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2570 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానములో అక్టోబర్ 31వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీలోపు అప్లై చేయాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్ యొక్క వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి..

RRB JE నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • ఈ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు నుండి విడుదల చేయడం జరిగింది..

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

  • దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్, కెమికల్ సూపర్వైజర్ & మెటలర్జికల్ అసిస్టెంట్ మరియు డిపో మేటీరియల్ సూపరింటెండెంట్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2570 పోస్టులు భర్తీ చేస్తున్నారు

ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు :

  • జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీలో డిప్లమో లేదా బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులు.
  • డిపో మేటీరియల్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు ఇంజనీరింగ్ లో ఏదైనా విభాగంలో డిప్లమో లేదా బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులు.
  • కెమికల్ సూపర్వైజర్ మరియు మెటలర్జికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టులతో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.

అప్లికేషన్ ప్రారంభ తేదీ :

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లో అక్టోబర్ 31వ తేదీ నుండి అప్లై చేయవచ్చు.

అప్లికేషన్ చివరి తేదీ :

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో నవంబర్ 30వ తేదీ లోపు అప్లై చేయాలి.

ఎంపిక విధానం వివరాలు :

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ను రెండు స్టేజీలలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది.

వయస్సు వివరాలు :

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • ఓబీసీ అభ్యర్థులకు వయస్సులో 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు వయసులో 10 సంవత్సరాలు సదలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

  • జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 500/- (బ్యాంకు చార్జీలు మినహాయించి 400 రూపాయలు అప్లికేషన్ ఫీజు స్టేజ్ -1 పరీక్ష రాసిన వారికి రిఫండ్ ఇస్తారు)
  • ఎస్సీ, ఎస్టి, ఓబీసీ, మహిళలు, ఎక్స్ సర్వీస్మెన్ మరియు ట్రాన్స్ జెండర్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 250/- (బ్యాంకు చార్జీలు మినహాయించి 250 రూపాయల అప్లికేషన్ ఫీజు స్టేజ్ 1 పరీక్ష రాసిన వారికి రిఫండ్ ఇస్తారు)

Download Short Notification – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *