SBI ASHA Scholarship 2025 Apply Link : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ను ప్రకటించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత లో భాగంగా నడుస్తున్న ఎస్బిఐ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ఈ స్కాలర్షిప్ లు అందజేస్తుంది. ఇందులో భాగంగా 2025-26 విద్యా సంవత్సరంలో 90 కోట్లను స్కాలర్షిప్ రూపంలో అందిస్తారు. భారతదేశంలోని 23,300 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ద్వారా ఆర్థిక సహాయం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ చేస్తుంది.
2022లో ప్రారంభమైన ఈ స్కాలర్షిప్ వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యను అందించేందుకు సహాయపడుతుందని ఎస్బిఐ ఫౌండేషన్ తెలిపింది…
ఈ స్కాలర్షిప్ కు ఎవరు అర్హులు :
9వ తరగతి నుండి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కు అర్హులు.
ఎంత స్కాలర్షిప్ ఇస్తారు :
ఎంపికైన విద్యార్థులకు 1,50,000 నుండి 20 లక్షల వరకు ప్రతి సంవత్సరం కోర్సు పూర్తయ్యే వరకు అందజేస్తారు.
అ అప్లికేషన్ తేదీలు :
సెప్టెంబర్ 18వ తేదీ నుండి నవంబర్ 15వ తేదీ వరకు అర్హత ఉన్న విద్యార్థులు ఆన్లైన్ విధానంలో ఎస్బిఐ ఆశ స్కాలర్షిప్ వెబ్సైట్లో అప్లై చేయాలి…
