ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత శాఖకు చెందిన ఐసిడిఎస్ ప్రాజెక్టులలో అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా విశాఖపట్నం జిల్లాలో మొత్తం ఏడు పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హత ఉండేవారు ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 29వ తేదీ నుండి అక్టోబర్ 10వ తేదీలోపు అప్లై చేయాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు పదో తరగతి పూర్తి చేసిన స్థానికంగా స్థిర నివాసం కలిగిన వివాహిత మహిళలు అప్లై చేయడానికి అర్హులు. ఉద్యోగాల ఎంపికలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపిక ప్రక్రియలో మౌఖిక ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు.
21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులకు 21 సంవత్సరాలు కలిగిన అభ్యర్థులు లేకపోతే 18 సంవత్సరాలు వయసు ఉన్న వారిని కూడా పరిగణలోకి తీసుకుంటారు.
ఎంపికైన వారికి నెలకు 11,500/- జీతం ఇస్తారు.
పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునేందుకు క్రింది ఇచ్చిన లింకు పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి…
✅ Download Notification – Click here
