RRB NTPC Recruitment 2025 : భారతీయ రైల్వేలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి లో గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల నుండి నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. ఈ నోటిఫికేషన్ ల ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. 8850 పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి విడుదల చేయడం జరిగింది.
తాజాగా విడుదలైన షార్ట్ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్నవారు అప్లై చేయండి.
✅ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం – Click here
Table of Contents :
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల నుండి విడుదల చేయడం జరిగింది.
నోటిఫికేషన్లు ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు:
- నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (గ్రాడ్యుయేట్) లో చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ ఎకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కం టైపిస్టు మరియు ట్రాఫిక్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
- నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి ( అండర్ గ్రాడ్యుయేట్) లో కమర్షియల్ కం టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్, జూనియర్ క్లాక్ కం టైపిస్టు మరియు ట్రైన్స్ క్లర్క్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు..
మొత్తం ఖాళీల సంఖ్య :
- నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (గ్రాడ్యుయేట్) లో 5800 పోస్టులు ఉన్నాయి. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (అండర్ గ్రాడ్యుయేట్) లో 3050 పోస్టులు ఉన్నాయి.
ఉండవలసిన అర్హతలు :
- నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు.
- నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాలకు 10+2 / ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ తేదీలు :
- నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాలకు అక్టోబర్ 21వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
- నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాలకు అక్టోబర్ 28వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
ఎంపిక ప్రక్రియ :
- ఈ ఉద్యోగాలు ఎంపికలు రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.
వయస్సు వివరాలు :
- గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాలకు 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
- అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
✅ Download NTPC (G) Notification – Click here
