AP Pharmacy Officer / Pharmacist Grade 2 Notification 2025 | AP PHC Pharmacist Grade 2 Notification 2025

AP Pharmacist Grade 2 Recruitment 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Andhra Pradesh Pharmacist Jobs Recruitment Details : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫార్మసీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను అక్టోబర్ 3వ తేదీ నుండి అక్టోబర్ 15వ తేదీ లోపు సబ్మిట్ చేయాలి.

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, జీతము, అప్లై విధానము, ఎంపిక విధానము మరియు ఇతర వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్నవారు అప్లై చేయండి..

Pharmacist నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • ఈ నోటిఫికేషన్ రాజమహేంద్రవరంలో ఉన్న రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ వారి కార్యాలయం నుండి విడుదలైంది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో జోన్ – 2 లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫార్మసీ ఆఫీసర్ లేదా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అనే ఉద్యోగాలు భర్తీ కోసం అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

ఉండవలసిన విద్యార్హతలు :

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి డిప్లమో ఇన్ ఫార్మసీ లేదా బీఫార్మసీ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

అప్లై చేయు విధానము :

  • అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ తో పాటు ఇచ్చిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసి నింపి అవసరమైన అన్ని సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలు మరియు అప్లికేషన్ ఫీజు చెల్లించిన డిడిని కూడా జతపరిచి రాజమహేంద్రవరంలో ఉన్న రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ వారి కార్యాలయంలో అందజేయాలి.

జీతము వివరాలు :

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 32,670/- రూపాయలు జీతం ఇస్తారు.

ఎంపిక విధానము :

  • ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపిక సంబంధించి మార్కుల కేటాయింపు వివరాలను నోటిఫికేషన్ లో తెలియజేశారు.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తే ఓసి అభ్యర్థులు 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు డిడి రూపంలో చెల్లించాలి.
  • మిగతా అభ్యర్థులు 300 రూపాయలు అప్లికేషన్ ఫీజు డిడి రూపంలో చెల్లించాలి.
  • అభ్యర్థులు రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, జూన్ 2 , రాజమహేంద్రవరం అనే పేరు మీద చెల్లుబాటు అయ్యే విధంగా డీడీ తీసి అప్లికేషన్ కు జతపరచాలి.

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :

  • అర్హతు ఉండే అభ్యర్థులు తమ అప్లికేషన్ ను The Regional Director of Medical and Health
  • Services, Zone II, YMCA Hall, Mallikarjuna Nagar, Rajamahendravaram

ముఖ్యమైన తేదీలు :

ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను అక్టోబర్ 3వ తేదీ నుండి అక్టోబర్ 15వ తేదీ లోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.

Download Notification & Application – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *