ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి వివిధ ప్రభుత్వ శాఖల్లో 47 పోస్టులను భర్తీ చేసేందుకు 10 నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి.
ఈ నోటిఫికేషన్లు ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో అప్లై చేయాల్సి ఉంటుంది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్, జైలు శాఖలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు వచ్చే నెల 15వ తేదీలోపు అప్లై చేయాలి.
అసిస్టెంట్ ఫిషరీస్ ఇన్స్పెక్టర్, గ్రేడ్-1 వార్డెన్, రాయల్టీ ఇన్స్పెక్టర్, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు అక్టోబర్ 8వ తేదీ నుండి 28వ తేదీలోపు అప్లై చేయాలి..
మున్సిపల్ శాఖలో అకౌంట్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలకు మరియు ఆంధ్రప్రదేశ్ సైనిక సంక్షేమ శాఖలో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారి, వెల్ఫేర్ ఆర్గనైజర్స్ ఉద్యోగాలకు అక్టోబర్ 9వ తేదీ నుండి 29వ తేదీలోపు అప్లై చేయాలి.
గమనిక :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్ నుండి పూర్తి నోటిఫికేషన్ స్ చదివి అర్హత ఉన్న ఉద్యోగాలకు అప్లై చేయండి.. All the best 👍
✅ Download All Notifications – Click here
