APPSC Municipal Department Jobs Recruitment 2025 | AP Municipal Department Notification 2025

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఏపీ మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్ లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారి నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు అక్టోబర్ 9వ తేదీ నుండి అక్టోబర్ 29వ తేదీ లోపు అప్లై చేయాలి.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్నవారు అప్లై చేయండి.. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాలు సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీసెస్ లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని రకాల పోస్టులు కలిపి మొత్తం 11 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు :

ఈ ఉద్యోగాలకు కామర్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేయడానికి అర్హులు.

జీతం వివరాలు :

జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ క్యాటగిరి 2 ఉద్యోగాలకు 44,570/- నుండి 1,27,480/- వరకు పే స్కేల్ ఉంటుంది.

సీనియర్ అకౌంటెంట్ క్యాటగిరి 3 ఉద్యోగాలకు 34,580/- నుండి 1,07,210/- వరకు పే స్కేల్ ఉంటుంది.

జూనియర్ అకౌంటెంట్ క్యాటగిరి 4 ఉద్యోగాలకు 25,220/- నుండి 80,910/- వరకు పే స్కేల్ ఉంటుంది.

వయస్సు వివరాలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.

ఎస్సీ, ఎస్టి, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది.

విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులను రాత పరీక్ష మరియు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

గమనిక :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

Download Full Notification – Click here

✅ Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *