పదో తరగతి అర్హతతో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు | AP Outsourcing Jobs Notification 2025

AP Latest Outsourcing Jobs
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

AP Government Medical College Outsourcing Jobs Recruitment : గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి వివిధ రకాల ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ అధికారికంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పదో తరగతి, డిగ్రీ మరియు ఇతర వివిధ రకాల విద్యార్హతలు ఉన్నవారు అప్లై చేసుకునే విధంగా పోస్టులు భర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 రకాల ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మొత్తం 41 పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది.

అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 23వ తేదీ నుండి అక్టోబర్ 1వ తేదీలోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. అప్లై చేయడానికి అవసరమైన అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి మరియు పూర్తి నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరిలో లింక్స్ ఇవ్వబడినవి. వాటి పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. All the best 👍

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేశారు.

🔥 ఏ ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా ఈసీజీ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, కార్పెంటర్, ఎంఎంఓ, ఎఫ్ఎన్ఓ , నర్సింగ్ ఆర్డర్లీ, దియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండర్, డ్రెస్సర్, St. బేరర్, డ్రైవర్ (LMV), వెహికల్ క్లీనర్, అటెండర్, బుక్ బేరర్, ల్యాబ్ అటెండెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 41 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 ఈ ఉద్యోగాలకు ఉండవలసిన విద్యార్హతలు :

ఈ ఉద్యోగాలకు క్రింద తెలిపిన విధంగా పోస్టులను అనుసరించి వివిధ విద్యార్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.

AP Outsourcing Jobs Notification 2025

🔥 అప్లై చేయు విధానము :

  • పోస్టులను అనుసరించి విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 23వ తేదీ నుండి అక్టోబర్ 1వ తేదీ లోపు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కార్యాలయంలో అప్లికేషన్ అందజేయాలి.

🔥 ఎంపిక విధానము వివరాలు :

  • అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ పద్ధతిలో ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్యమైన తేదీలు :

  • తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు సెప్టెంబర్ 23వ తేదీ నుండి అక్టోబర్ 1వ తేదీ లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
  • అప్లై చేసుకున్న అప్లికేషన్స్ అక్టోబర్ 3వ తేదీ నుండి అక్టోబర్ 8వ తేదీ మధ్య వెరిఫికేషన్ చేస్తారు.
  • అక్టోబర్ 9వ తేదీన అభ్యర్థుల ప్రయోజనాలు మెరిట్ లిస్టు విడుదల చేసి అక్టోబర్ 10, 11 తేదీల్లో ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే గ్రీవెన్స్ స్వీకరిస్తారు.
  • జిల్లా కలెక్టర్ ఆమోదం అనుమతితో అక్టోబర్ 15వ తేదీ నాటికి ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తారు.
  • ఎంపికైన వారికి అక్టోబర్ 17వ తేదీన ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు వివరాలు :

  • ఓసి, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు అయితే అప్లికేషన్ ఫీజు 300 రూపాయలు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులు అయితే వంద రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • ఈ ఫీజును ఏదైనా జాతీయ బ్యాంకులో కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ, GMC, శ్రీకాకుళం అనే పేరు మీద చెల్లుబాటు అయ్యే విధంగా డిడి తీసి అప్లికేషన్ కు జతపరచాలి.

🔥 గమనిక :

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేయండి.

Download Notification – Click here

Download Application – Click here

Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *