SSC Delhi Police Constable Recruitment 2025 | Qualification, Age, Salary, Selection Process, Apply Link

Delhi Police Constable Recruitment 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

SSC Delhi Police Constable Notification 2025 : పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త ! స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుండి ఢిల్లీ పోలిస్ డిపార్ట్మెంట్ లో పని చేసేందుకు గాను , పురుషులు మరియు మహిళలు దరఖాస్తు చేసుకునే విధంగా కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) ఉద్యోగాల భర్తీ కొరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల అయింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7565 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంస్థ విడుదల చేసిన ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు అనగా అవసరమగు విద్యార్హతలు ఏమిటి ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది ? దరఖాస్తు చేసుకోవడానికి చివర తేదీ ఏమిటి ? జీతభత్యాలు ఎంత లభిస్తాయి ? వంటి అన్ని అంశాల సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.

✅ 10th, ఇంటర్ అర్హతలతో 7565 ఉద్యోగాలు – Click here

🔥 Delhi Police Constable Jobs Recruitment Organisation :

  • స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయింది.

🔥 Jobs to be filled in Delhi Police Department :

  • ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ ( ఎగ్జిక్యూటివ్ ) – ఢిల్లీ పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 SSC Delhi Police Constable Total Vacancies :

  • మొత్తం 7565 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 SSC Delhi Police Constable Qualifications :

  • ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్థులు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • విద్యార్హత నిర్ధారణ కొరకు 21/10/2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
  • పురుష అభ్యర్థులు ఫిజికల్ ఎఫిషియన్సీ మరియు మెజర్మెంట్ టెస్ట్ ( PE & MT ) నాటికి LMV ( మోటార్ సైకిల్ లేదా కారు ) డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలి. లెర్నర్ లైసెన్స్ పనికిరాదు.

🔥 SSC Delhi Police Constable Age Details :

  • 18 సంవత్సరాలు నిండి వుండి 25 సంవత్సరాలలోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయస్సు నిర్ధారణ కొరకు 01/07/2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబీసీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు ప్రభుత్వ నియమ నిబంధన మేరకు వయో సడలింపు లభిస్తుంది.

🔥 How to Apply Delhi Police Constable Jobs :

  • ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్న వారు ఆన్లైన్ విధానం ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారి అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • గతంలో వన్ టైం రిజిస్ట్రేషన్ ( OTR ) పూర్తి చేసుకున్న వారు సంబంధిత లాగిన్ వివరాలు తో లాగిన్ అయ్యి , నేరుగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వన్ టైం రిజిస్ట్రేషన్ ( OTR ) పూర్తి చేసుకొని వారు ఉంటే ముందుగా రిజిస్టర్ చేసుకొని ఆ తర్వాత దరఖాస్తు చేసుకోవాలి.

🔥 దరఖాస్తు ఫీజు :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా వంద రూపాయలు దరఖాస్తు ఫీజులు చెల్లించండి.
  • మహిళలు , ఎస్సీ , ఎస్టి , ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు కలదు.

🔥 ఎంపిక విధానం :

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష , ఫిజికల్ మెజర్మెంట్ మరియు ఎఫిషియన్సీ టెస్ట్ ( PMET) మరియు మెడికల్ టెస్ట్ నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 వ్రాత పరీక్షా విధానం :

  • ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత , ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ విధానం లో ( మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు ) నిర్వహిస్తారు.
  • ఇందులో భాగంగా జనరల్ నాలెడ్జ్ , కరెంట్ అఫ్ఫైర్స్ ( 50 మార్కులకు గాను 50 ప్రశ్నలు ) , రీజనింగ్ ( 25 ప్రశ్నలకు 25 మార్కులు ) , న్యూమరికల్ ఎబిలిటీ ( 15 ప్రశ్నలకు 15 మార్కులు ), కంప్యూటర్ ఫండమెంటల్ , కంప్యూటర్ పరిజ్ఞానం ( 10 ప్రశ్నలకు 10 మార్కులు ) వుంటాయి.
  • పరీక్ష నిర్వహణకు 90 నిమిషాల సమయం కేటాయించారు.
  • 1/3 వంతు నెగిటివ్ మార్కింగ్ విధానం కలదు.

🔥 పరీక్షా కేంద్రాలు :

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సమయంలోనే అభ్యర్థి ఏ నగరంలో పరీక్షను రాయాలి అనుకుంటున్నారు సంబంధిత వివరాలను నమోదు చేసుకోవాలి.
  • దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
  • తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో : చీరాల , గుంటూరు , కాకినాడ , కర్నూలు , నెల్లూరు , రాజమండ్రి , తిరుపతి , విజయవాడ , విశాఖపట్నం , ఏలూరు , ఒంగోలు నందు మరియు తెలంగాణ రాష్ట్రంలో : హైదరాబాద్ / సికింద్రాబాద్ , వరంగల్ , సిద్దిపేట్ నందు పరీక్ష నిర్వహిస్తారు.

🔥 లభించే జీతభత్యాలు :

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పే లెవెల్ – 03 క్రింద గ్రూప్ సి పే స్కేల్ 21700 /- రూపాయల నుండి 69100 /- రూపాయలు వర్తిస్తుంది.
  • బేసిక్ పే తో పాటుగా వివిధ అలవెన్సులు వీరికి లభిస్తాయి.

🔥 ముఖ్యమైన తేదీలు :

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 22/09/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 21/10/2025 ( రాత్రి 11:00 గంటల వరకు )
  • ఆన్లైన్ విధానం ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : 22/10/2025 ( రాత్రి 11:00 గంటల వరకు )
  • ఫీజు చెల్లింపు విధానం ద్వారా దరఖాస్తు లో మార్పులు చేయుటకు అవకాశం కల్పించిన తేదీలు : 29/10/2025 నుండి 31/10/2025 ( రాత్రి 11:00 గంటల వరకు )
  • కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహణ ( తాత్కాలికం) : డిసెంబర్ 2025 లేదా జనవరి 2026

👉 Click here for notification

👉 Click here to apply

👉 Click here for official website

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *