AP Government Free Coaching for Unemployed Candidate’s : నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి , స్టైఫండ్ కూడా అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉచిత కోచింగ్ కొరకు దరఖాస్తు చేసుకొని , లబ్ధి పొందగలరు. ఈ ఉచిత కోచింగ్ ఈ ఉద్యోగాల కొరకు ఇస్తారు ? ఉండాల్సిన విద్యార్హతలు ఏమిటి ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? స్టైఫండ్ ఎంత లభిస్తుంది ? వంటి వివిధ అంశాల సమగ్ర సమాచారం కొరకు ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
Table of Contents :
🔥ఫ్రీ కోచింగ్ అందించే సంస్థ :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో గల అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ వారు ఈ ఉచిత కోచింగ్ అందిస్తారు.
- సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో ఈ ఉచిత శిక్షణ కల్పిస్తున్నారు.
🔥 ఏ ఏ ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్ ఇస్తారు ? :
- బ్యాంక్ ఎగ్జామ్ పరీక్షలు ( IBPS PO , Clerk , వంటివి…)
- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు ( CGL ,CHSL , MTS , G.D , ఢిల్లీ పోలీస్ ..వంటివి )
- రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్షలు (NTPC, ALP , టెక్నీషియన్ Group D …వంటివి)
- మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు వారి అవసరానికి అనుగుణంగా ఉచితంగా శిక్షణ అందిస్తారు.
🔥 ఉచిత కోచింగ్ తీసుకొనేందుకు ఎవరు అర్హులు :
- నిరుద్యోగులు అయిన ఎస్సీ , ఎస్టీ , బీసీ , ఓసి యువత ( పురుషులు & మహిళలు ) ఈ ఉచిత కోచింగ్ తీసుకొనేందుకు అర్హత కలిగి ఉంటారు.
- ఇటీవల తమ విద్యారత చివరి సంవత్సరం పూర్తి చేసుకున్న వారు కూడా ఈ ఉచిత కోచింగ్ కి దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? :
- ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునేందుకుగాను అవకాశం కల్పిస్తారు.
- ఇటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితం గాని దరఖాస్తు చేసుకోవచ్చు.
- సెప్టెంబర్ 24 వ తేదీ నుండి అక్టోబర్ 06 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు.
🔥 లభించే సదుపాయాలు :
- ఎంపిక అయిన వారికి పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందించడంతోపాటు , శిక్షణ కాలం మొత్తానికి ఉచిత వసతి మరియు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు.
🔥 ఎంపిక విధానం :
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వారి జిల్లా ప్రధాన కేంద్రాలలో అక్టోబర్ 12వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి , స్క్రీనింగ్ టెస్ట్ లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఈ ఉచిత శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 ఉచిత శిక్షణ కేంద్రాలు :
- తిరుపతి , విశాఖపట్నంలలో ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్ ల ద్వారా ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం జరుగుతుంది.
🔥 మరింత సమాచారం కొరకు సంప్రదించవలసిన నెంబర్ :
- ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం పై ఇంకెవరికైనా ఏవైనా సందేహాలున్న , మరింత సమాచారం కావాలన్నా 9949686306 నెంబర్ ను సంప్రదించవచ్చు.
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 24/09/2025
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 06/10/2025
- స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణ తేదీ : 12/10/2025.
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం. ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటుగా వసతి మరియు భోజన సౌకర్యాలను కూడా కల్పిస్తుంది. ఆన్లైన్ విధాన ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సర్కిల్ డైరెక్టర్ వెంకటేష్ ప్రసన్న తెలియజేశారు. ఉచిత శిక్షణ అందించేందుకు ఆసక్తిగల సంస్థల నుండి టెండర్లను కూడా ఆహ్వానించడం జరిగింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము.
👉 Click here to apply for free coaching
