ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల నేషనల్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్ర ప్రదేశ్ (NIT) సంస్థ నుండి పార్ట్ టైం స్పోర్ట్స్ కోచ్ ల ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయింది.
తాడేపల్లిగూడెం ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ NIT టీలో ఈ స్పోర్ట్స్ కోచ్ ఉద్యోగానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? మొత్తం ఎంతమంది కోచ్ లను రిక్రూట్ చేస్తున్నారు ? అర్హత ప్రమాణాలు ఏమిటి ? జీతం ఎంత లభిస్తుంది వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
Table of Contents :
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ సంస్థ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- టెంపరరీ ( పార్ట్ టైం ) ప్రాదిపాదికన స్పోర్ట్స్ కోచ్ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేస్తున్న కోచ్ ల స్పోర్ట్ / గేమ్ విభాగాలు :
- కబడ్డీ
- ఫుట్ బాల్
- క్రికెట్
- పవర్ స్పోర్ట్స్ ( వెయిట్ లిఫ్టింగ్)
- చెస్
- స్విమ్మింగ్
- బ్యాడ్మింటన్
- బాస్కెట్ బాల్
- అథ్లెటిక్స్
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య :
- నోటిఫికేషన్లు ప్రస్తావించిన ఒక్కొక్క స్పోర్ట్ / గేమ్ కు ఒక్కొక్క పార్ట్ టైం కోచ్ ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు.
- అనగా మొత్తం తొమ్మిది ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 అవసరమగు వయస్సు :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకుగాను 50 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 అవసరమైన విద్యార్హతలు మరియు ఇతర అర్హతలు :
- యు జి సి చే గుర్తించబడిన ఏదైనా సంస్థ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- అంతర్జాతీయ / జాతీయ స్థాయిలో ఏదైనా ఒక స్పోర్ట్ / గేమ్ నందు పార్టిసిపేట్ చేసి ఉండాలి లేదా స్పోర్ట్స్ కోచింగ్ నందు ఒక సంవత్సరం డిప్లమో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ఉన్నత విద్యాసంస్థల నందు కనీసం 2 సంవత్సరాలు కోచింగ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
🔥 దరఖాస్తు చేయు విధానం :
- ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ లో ప్రస్తావించిన దరఖాస్తును ఫిల్ చేసి , వాక్ ఇన్ ఇంటర్ ఫీజు నిర్వహించే తేదీ నాడు సంబంధిత ధ్రువపత్రాలతో సహా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగానికి సంబంధించి అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు 15/09/2025 ( సోమవారం ) ఉదయం 09:00 గంటలకు నిర్వహించే వాక్ ఇన్ ఇంటరాక్షన్ నందు పాల్గొనాలి.
- అర్హత గల అభ్యర్థులను వాక్ ఇన్ ఇంటరాక్షన్ ద్వారా షార్ట్ లిస్ట్ చేస్తారు.
🔥 రిపోర్టింగ్ చేయాల్సిన వేదిక వివరాలు :
- రూమ్ నెంబరు 411 , నాల్గవ ఫ్లోర్ , సర్దార్ వల్లభాయ్ పటేల్ అడ్మినిస్ట్రేటివ్ విస్తా , ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ .
🔥 జీతం :
- ఈ ఉద్యోగానికి ఎంపిక కాబడిన వారికి ఒక్కొక్క సెషన్ కి 1200 రూపాయలు చొప్పున ( ఒక సెషన్ అనగా రెండు గంటలు ) గరిష్టంగా నెలకు 24 వేల రూపాయలు జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు :
- వాక్ ఇన్ ఇంటరాక్షన్ నిర్వహణ తేదీ : 15/09/2025 ( ఉదయం 09:00 గంటలు )
