APPSC Forest Beat Officer Question Paper and Answer Key : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ 7వ తేదీన ప్రాథమిక రాత పరీక్షను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించడం జరిగింది. ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహించగా ప్రతి ప్రశ్నకి ఒక మార్కు చొప్పున కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంటుంది.
పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రశ్నాపత్రం సులభంగానే వచ్చిందని అభిప్రాయపడ్డారు. అయితే అటవీ శాఖలో ఉద్యోగాలకు ఈ రాత పరీక్షలు నిర్వహించారు కాబట్టి ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ కు సంబంధించిన ప్రశ్నలు వస్తాయని అభ్యర్థులు భావించినప్పటికీ ఆ ప్రశ్నలు రాలేదు. బోటనీ నుండి కూడా ఎక్కువ ప్రశ్నలు ఇవ్వలేదు. ఎక్కువగా పర్యావరణం మరియు సుస్థిరాభివృద్ధికి సంబంధించిన ప్రశ్నలు ప్రశ్నాపత్రంలో కనిపించాయి.
✅ డిగ్రీ అర్హతతో 13,217 ఉద్యోగాలు – Click here
Download APPSC Forest Beat Officer Answer Key :
క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి ప్రశ్నాపత్రం మరియు కీ డౌన్లోడ్ చేసుకోండి.. ఈ కీను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారికంగా విడుదల చేసింది..
ఈ కీ పై మీకేమైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 10వ తేదీ నుండి 12వ తేదీ మధ్య ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి అభ్యంతరాలు తెలుపవచ్చు.
🏹 Download APPSC FBO / ABO Official Key – Click here
