తిరుమల తిరుపతి దేవస్థానం వైద్య సంస్థలో ఉద్యోగాలు | TTD SVIMS Recruitment 2025

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లో గల శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నందు గల డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సహాయ NIDAN (నేషనల్ ఇన్ హెరిడేటెడ్ డిజార్డర్స్ అడ్మినిస్ట్రేషన్ కేంద్రాస్) నందు పనిచేసేందుకు గాను వివిధ ఉద్యోగాలను తాత్కాలికంగా కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్టు అసోసియేట్ , ప్రాజెక్టు అసిస్టెంట్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించి విద్యార్హత ఏమి ఉండాలి ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? ఎంపికైన వారికి ఎంత జీతాలు లభిస్తాయి ? దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి ? వంటి వివిధ అంశాల కొరకు ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , తిరుపతి వారి నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వారి సహకారంతో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నందు ఉన్న NIDAN కేంద్రాల లో పనిచేసేందుకుగాను ప్రాజెక్టు అసోసియేట్ , ప్రాజెక్ట్ అసిస్టెంట్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మూడు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పోస్టుల ఆధారంగా ఉద్యోగాల భర్తీ ఈ విధంగా ఉంది.
  • ప్రాజెక్ట్ అసోసియేట్ – 01
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 01
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 01

🔥 అవసరమగు విద్యార్హతలు :

  • ప్రాజెక్టు అసోసియేట్ : జెనెటిక్స్ / బయోటెక్నాలజీ / లైఫ్ సైన్సెస్ / మాలిక్యులర్ బయాలజీ నందు ఎమ్మెస్సీ ఉత్తీర్ణత లేదా అర్హత కలిగి ఉండి , NET / GATE ఉత్తీర్ణత సాధించాలి. ( లేదా ) సంబంధిత విభాగాలలో ఎంటెక్ లేదా ఎమ్మెస్సీ ఉత్తీర్ణత సాధించి Human Genetics / Cytogenetics / Molecular Biology నందు
    రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్ : లైఫ్ సైన్సెస్ / మెడికల్ లాబరేటరీ టెక్నాలజీ ( MLT) / బయోటెక్నాలజీ విభాగాలలో బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ : ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి కంప్యూటర్ అప్లికేషన్స్ నందు డిప్లమో లేదా సర్టిఫికెట్ పొంది ఉండాలి మరియు MS ఆఫీస్ , డేటా మేనేజ్మెంట్ నందు ప్రావీణ్యత కలిగి ఉండాలి.

🔥 వయోపరిమితి :

  • ప్రాజెక్ట్ అసోసియేట్ – I ఉద్యోగాలకు 35 సంవత్సరాల లోపు వారు , ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 30 సంవత్సరాల లోపు వారు , డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు 28 సంవత్సరాలు లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • నోటిఫికేషన్ విడుదల కాబడిన తేదీని కటాఫ్ తేదీ గా నిర్ణయించారు.

🔥 దరఖాస్తు చేయు విధానం :

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఉందిగా నోటిఫికేషన్ లో ప్రస్తావించబడిన గూగుల్ ఫామ్ నందు రిజిస్టర్ చేసుకోవాలి.
  • దరఖాస్తు తో పాటుగా సంబంధిత ధ్రువపత్రాలు కార్యాలయ చిరునామాకు 27/09/2025 లోగా పంపించాలి.
  • Principal Investigator, DBT-NIDAN Kendra, SVIMS, Tirupati వారికి దరఖాస్తు పంపించాల్సి ఉంటుంది.

🔥 దరఖాస్తు పంపించవలసిన చిరునామా :

  • Dr. Alekhya. M
  • Assistant Professor/principal investigator
  • DBT NIDAN Kendra at SVIMS
  • Department of pathology
  • SVIMS, TRUPATI
  • ANDHRA PRADESH, PIN: 51750

🔥 దరఖాస్తు తో పాటుగా జత చేయవలసిన ధ్రువపత్రాలు :

  • విద్యార్హత సర్టిఫికెట్లు
  • డేట్ అఫ్ బర్త్ కొరకు ధ్రువపత్రం
  • ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్
  • ఇటీవలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
  • ఆధార్ / పాన్ / ఓటర్ ఐడి / డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డులు
  • ఇతర దృవపత్రాలు ఏమైనా

🔥 ఎంపిక విధానం :

  • ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి , ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • ఇంటర్వ్యూ ఆన్లైన్/ ఆఫ్లైన్ లో నిర్వహించవచ్చు.
  • షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థులు జాబితాను వెబ్సైట్ నందు పొందుపరుస్తారు.

🔥 జీతభత్యాలు :

  • జీతభత్యాలు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
  • ప్రాజెక్టు అసోసియేట్ – I గా ఎంపిక కాబడిన వారికి 31,000 రూపాయలు మరియు 8 శాతం HRA లభిస్తుంది.
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా ఎంపిక కాబడిన వారికి 20వేల రూపాయలు మరియు 8 శాతం HRA లభిస్తుంది.
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 18000 రూపాయలు జీతం లభిస్తుంది.

🔥 ముఖ్యమైన తేదీలు :

  • కార్యాలయానికి దరఖాస్తు చేరడానికి చివరి తేదీ : 27/09/2025
  • గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేదీ :29/09/2025

Download Notification – Click here

Official Website – Click here

Download Application – Click here

Google Form Link – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *