LIC HFL Apprentice Recruitment 2025 :
ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) సంస్థ నందు డిగ్రీ అర్హతతో అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు నోటిఫికేషన్ విడుదలైంది.
ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ గా పని చేసింది గాను నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ 192 అప్రెంటిస్ లను నియామకం చేయనుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అనగా ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? నెల వారి స్టైఫండ్ ఎంత లభిస్తుంది ? ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది ? ఏ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
Table of Contents :
🔥 LIC HFL Apprentice Notification Notification Released by the Company :
- లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) సంస్థ ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 LIC HFL Recruitment Jobs: :
- అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
✅ AP ఈ పథకం ద్వారా వారి అకౌంట్లో 15,000/- జమ – Click here
🔥 LIC HFL Total Vacancies :
- దేశవ్యాప్తంగా మొత్తం 192 అప్రెంటిస్ ఉద్యోగాలను చేస్తున్నారు.
- ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 , తెలంగాణ రాష్ట్రంలో 20 ఉద్యోగాల భర్తీ జరగనుంది.
- ఆంధ్రప్రదేశ్ : పట్టణాల వారిగా ఖాళీల సంఖ్య
- 1. అనంతపూర్ – 01
- 2. కాకినాడ – 01
- 3.కర్నూలు – 01
- 4. నెల్లూరు – 01
- 5.రాజమండ్రి – 01
- 6. తిరుపతి – 01
- 7. విజయవాడ – 04
- 8.విశాఖపట్నం – 04
- తెలంగాణ : పట్టణాల వారిగా ఖాళీల సంఖ్య.
- 1. హైదరాబాద్ – 16
- 2.కరీంనగర్ – 01
- 3. మహబూబ్ నగర్ – 01
- 4. సికింద్రాబాద్ – 02
🔥 వయో పరిమితి :
- 20 నుండి 25 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు నిర్ధారణ కొరకు 01/09/2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
🔥 అవసరమగు విద్యార్హత :
- అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విద్యార్హతను 01/09/2021 నుండి 01/09/2025 లోపు గా పూర్తి చేసి ఉండాలి.
🔥 దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా NATS అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
🔥 దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు 944 రూపాయలు & ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు 708 రూపాయలు & దివ్యాంగులు 472 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులకు ఆన్లైన్ వ్రాత పరీక్ష నిర్వహించి , ఎంపిక చేస్తారు. ఇందులో భాగంగా బ్యాంకింగ్ , ఇన్వెస్ట్మెంట్ , ఇన్సూరెన్స్ , క్వాంటిటేటివ్, రీజనింగ్, కంప్యూటర్ లిటరసీ, ఇంగ్లీష్ వంటి సబ్జెక్ట్ ల పై 100 ప్రశ్నలు ఇస్తారు. 60 నిముషాలు సమయం కేటాయించారు.
- వ్రాత పరీక్ష లో షార్ట్ లిస్ట్ కాబడిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- ఎంపిక కాబడినవారు 12 నెలల కాలానికి గాను అప్రెంటిస్ట్ గా పనిచేసేందుకు అర్హత సాధిస్తారు.
✅ AP డిజిటల్ కార్పోరేషన్ లో ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 స్టైఫండ్ :
- ఎంపిక కాబడిన వారికి నెలకు 12 వేల రూపాయలు చొప్పున స్టైఫండ్ లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 02/09/2025
- దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 22/09/2025
- పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : 24/09/2025
- పరీక్ష నిర్వహణ తేదీ : 01/10/2025
- షార్ట్ లిస్ట్ కాబడిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహణ తేదీ : 08/10/2015 నుండి 14/10/2025
- అప్రెంటిస్ కొరకు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ & ఆఫర్ లెటర్స్ జారీ చేయు తేదీ : 15/10/2025 నుండి 20/10/2025
- అప్రెంటిస్ ట్రైనింగ్ కొరకు రిపోర్ట్ చేయు తేదీ : 01/11/2025
