Telangana Latest jobs Notifications in Telugu | Telangana Jobs

Telangana Jobs Recruitment 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Telangana Government Jobs: తెలంగాణ రాష్ట్రంలో గల హైదరాబాద్ జిల్లాలో ఉన్న శిశు విహార్ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ ( SAA) నందు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేందుకు గాను వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ & సీనియర్ సిటిజన్స్ , జిల్లా సంక్షేమ అధికారి నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా నర్స్ , చౌకీదార్, సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలియజేయడం జరిగింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హత ఉంటే తప్పనిసరిగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

ప్రభుత్వ సంస్థలో 554 ఉద్యోగాలు – Click here

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ & సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంట్ వారి నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా నర్స్ ( మహిళ ) , చౌకిదార్స్ , సెక్యూరిటీ గార్డ్స్ ( పురుషుడు & మహిళ ) ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికను భర్తీ చేస్తున్నారు.

✅ గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఉద్యోగాలు – Click here

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉద్యోగాల వారీగా సంఖ్య ఈ విధంగా ఉంది.
  • నర్స్ ( మహిళ ) – 04
  • చౌకిదార్స్ – 03
  • సెక్యూరిటీ గార్డ్స్ ( పురుషుడు – 01 & మహిళ – 02 ) – 03

🔥 అవసరమగు విద్యార్హత :

1. నర్స్ ( మహిళ ) : ఏఎన్ఎం పోస్టుకు సంబంధించిన విద్యార్హతలు కలిగి ఉన్న వైద్య సిబ్బంది అయి ఉన్నవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

2. చౌకిదార్స్ : గతంలో నైతిక దుర్బలత్వం లేని , నిబద్ధత మరియు చురుకైన వ్యక్తి మరియు మద్యం, గుట్కా నమలడం వంటి అదనపు పదార్థాలు లేని వ్యక్తి ఈ ఉద్యోగానికి పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

3. సెక్యూరిటీ గార్డ్స్ : 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి , తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషలు రాయడం చదవడం వచ్చి ఉన్న , విజిటర్స్ పాస్ సిస్టంపై అవగాహన మరియు ఇతర అంశాలపై అవగాహన ఉన్న వ్యక్తి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥 వయోపరిమితి :

  • నర్స్ ఉద్యోగులకు 25 సంవత్సరాలనుండి 35 సంవత్సరాల లోపు వారు , చౌకీదారు ఉద్యోగాలకు 25 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వారు , సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగాలకు 21 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకునేందుకుగాను అవకాశం కల్పించారు.
  • వయసు నిర్ధారణ కొరకు 01/07/2025 ను కట్ ఆఫ్ తేదీ పరిగణిస్తారు.
  • ఎస్సీ , ఎస్టీ , బీసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు & దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు లభిస్తుంది.

🔥 దరఖాస్తు చేయు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని , ఫిల్ చేసి ఈ క్రింద పేర్కొన్న కార్యాలయానికి 26/08/2025 నుండి 15/09/2025 లోగా అందజేయాలి.

🔥 దరఖాస్తు అందచేయవలసిన చిరునామా :

  • O/o the district welfare officer , WCD & SC , Hyderabad , Sneha silver jubi complex , 4 th floor , Room No. 404 , Hyderabad collectorate premises , lakdikapool , Hyderabad 500004.

🔥 జీతం :

  • ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి పోస్ట్ ఆధారంగా నెలవారి రెమ్యూనరేషన్ లభిస్తుంది. నెలవారి రెమ్యూనికేషన్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
  • నర్స్ ( మహిళ ) – 13240 /-
  • చౌకిదార్స్ – 14500 /-
  • సెక్యూరిటీ గార్డ్స్ ( పురుషుడు & మహిళ ) – 15600 /-

🔥 ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 26/08/2025
  • దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 15/09/2025

Click here to download notification and application

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *