NMMS Scholarship 2025-26 : ప్రభుత్వ పాఠశాలలలో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందించే నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (NMMS) కొరకు 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
కేంద్ర ప్రభుత్వం విద్యా శాఖ ఆధ్వర్యం లో 2008 విద్యా సంవత్సరం నుండి ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ను ప్రారంభించింది. ఈ స్కాలర్షిప్ నకు ఎంపిక అయిన వారికి 9 వ తరగతి నుండి ఇంటర్మీడియట్ పూర్తి అయ్యేంత వరకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు అందచేస్తారు.
NMMS స్కాలర్షిప్ కొరకు ఎటువంటి విద్యార్హతలు కలిగి వుండాలి. ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక కొరకు నిర్వహించే పరీక్ష ఏ విధంగా నిర్వహిస్తారు. ఇతర అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
పదో నుండి డిగ్రీ చదివే విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తున్న ఎల్ఐసి – Click here
Table of Contents
🔥 NMM Scholarship Full Form :
- నేషనల్ మెరిట్ కం మీన్స్ స్కాలర్షిప్ స్కీమ్ 2025 – 26.
🔥 Who provides NMMS scholarship? :
- భారత ప్రభుత్వం , విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గల డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ నుండి ఈ స్కాలర్షిప్ అందచేస్తారు.
🔥 NMMSS main objective :
- ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు ప్రదానం చేయడం, 8వ తరగతిలో వారి డ్రాపౌట్ను అరికట్టడం మరియు సెకండరీ దశలో చదువును కొనసాగించేలా వారిని ప్రోత్సహించడం ఈ స్కాలర్ షిప్ యొక్క ప్రధాన లక్ష్యం.
🔥 లభించే స్కాలర్ షిప్ :
- ఈ స్కాలర్షిప్ పథకం ద్వారా ఎంపిక కాబడిన విద్యార్థులకు 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ పూర్తి అయ్యేంత వరకు ప్రతి సంవత్సరం నెలకు వెయ్యి రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 స్కాలర్షిప్ మొత్తంగా లభిస్తుంది.
✅ ఏపీ వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలకు మీ మొబైల్ లో అప్లై చేయండి – Click here
🔥 Requirements for NMMS scholarship :
- ఈ స్కాలర్షిప్ పొందేందుకు గాను ఈ క్రింది అర్హతలు అవసరం అవుతాయి.
- విద్యార్థులు ప్రభుత్వ / ప్రభుత్వ అనుబంధ పాఠశాలలో 8 వ తరగతి చదువుతూ వుండాలి.
- కుటుంబ వార్షిక ఆదాయం 3.50 లక్షల లోపు ఉండాలి.
- విద్యార్థులు 7 వ తరగతి లో కనీసం 55 శాతం మార్కులు పొంది వుండాలి. ( ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించినా దరఖాస్తు చేసుకోవచ్చు )
🔥 వయస్సు :
- 8 వ తరగతి చదువుతున్న విద్యార్థులు , 13 నుండి 15 సంవత్సరాలు లోపు వయస్సు కలిగి వున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
🔥 దరఖాస్తు విధానం :
- ఈ స్కాలర్షిప్ కొరకు అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు చేసేటప్పుడు విద్యార్థుల వివరాలు ఆధార్ కార్డు లో ఉన్న విధంగా నమోదు చేసుకోవాలి. విద్యార్థి పేరు , పుట్టిన తేదీ , తండ్రి పేరు తప్పులు లేకుండా నమోదు చేయాలి.
- దరఖాస్తు చేయు సమయంలో ఎటువంటి ధ్రువపత్రాలు అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. అయితే పరీక్ష రాసే సమయానికి మాత్రం అన్ని ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోవాలి.
🔥 దరఖాస్తు ఫీజు :
- ఈ స్కాలర్ షిప్ కొరకు దరఖాస్తు చేసుకొనేందుకు గాను ఆన్లైన్ విధానం లో దరఖాస్తు ఫీజును చెల్లించవలసి ఉంటుంది.
- ఓసీ , బీసీ అభ్యర్థులు 100 రూపాయలు & ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SBI కలెక్ట్ లింక్ ద్వారా మాత్రమే పరీక్షా ఫీజు చెల్లించవలసి ఉంది.
🔥 స్కాలర్షిప్ కొరకు ఎంపిక విధానం :
- ఈ స్కాలర్షిప్ కొరకు ఎంపిక చేసేందుకు గాను రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో భాగంగా
- 1. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (MAT ) : 90 మార్కులకు గాను 90 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు కేటాయించారు. ఎటువంటి నెగటివ్ మార్కింగ్ విధానం ఉండదు.
- 2. స్కాలిస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ( SAT ) : ఇందులో కూడా 90 ప్రశ్నలు ఉంటాయి.90 మార్కులు కేటాయించారు. సైన్స్ , సోషల్ , మ్యాథ్స్ ప్రశ్నలు వుంటాయి. ఇందులో కూడా ఎటువంటి నెగటివ్ మార్కింగ్ విధానం లేదు.
- ఈ పరీక్ష లో విద్యార్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి . ఎస్సీ , ఎస్టీ విద్యార్థులు కనీసం 32 శాతం మార్కులు సాధించాలి.
- వ్రాత పరీక్ష ను 07/12/2025 నాడు నిర్వహిస్తారు. సొంత జిల్లాలోనే పరీక్ష రాసే అవకాశం ఉంటుంది.
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 04/09/2025
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 30/09/2025
👉 Click here for paper statement