భారత ప్రభుత్వ అండర్ టేకింగ్ సంస్థ , నవరత్న కంపెనీ అయినటువంటి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCF లిమిటెడ్ ) సంస్థ నందు అప్రెంటిస్ ట్రైనింగ్ కొరకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ , టెక్నీషియన్ అప్రెంటిస్ , ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 554 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల భర్తీ కొరకు అవసరమగు విద్యార్హతలు ఏమిటి ? ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది ? వయోపరిమితి ఎంత ? జీతం ఎంత లభిస్తుంది వంటి ఇతర అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
Table of Contents
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCF limited )
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ , టెక్నీషియన్ అప్రెంటిస్ , ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య :
మొత్తం 554 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో భాగంగా ఈ క్రింది విధంగా ఉద్యోగాల భక్తి జరుగుతుంది.
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 115
- టెక్నీషియన్ అప్రెంటిస్ – 114
- ట్రేడ్ అప్రెంటిస్ – 325
🔥 గరిష్ఠ వయోపరిమితి :
- 18 సంవత్సరాల వయస్సు నిండి యుండి 25 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు నిర్ధారణ కొరకు 01/07/2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు ప్రతి సంవత్సరాలు 10 సంవత్సరాలు వయో. సడలింపు లభిస్తుంది.
🔥 విద్యార్హతలు :
ఈ ఉద్యోగాలకు సంబంధించి సంబంధిత విభాగాల వారీగా విద్యార్హతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత విద్యార్హత లో కనీసం 50 శాతం మార్కులు పొంది వుండాలి. విద్యార్హతను 01/07/202 నాటికి పూర్తి చేసి ఉండాలి.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ :
- 1.అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్
👉 B.Com లేదా BBA చదివి ఉండాలి మరియు ఇంగ్లీష్ & కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి - 2.సెక్రటేరియల్ అసిస్టెంట్
👉 ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి మరియు ఇంగ్లీష్ & కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. - 3.HR ఎగ్జిక్యూటివ్
👉 ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి మరియ ఇంగ్లీష్ & కంప్యూటర్ తెలిసి ఉండాలి.
టెక్నీషియన్ అప్రెంటిస్:
- కెమికల్ ఇంజినీరింగ్
👉 కెమికల్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. - సివిల్ ఇంజినీరింగ్
👉 సివిల్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. - కంప్యూటర్ ఇంజినీరింగ్
👉 కంప్యూటర్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. - ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
👉 ఎలక్ట్రికల్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. - ఇన్స్ట్రుమెంటేషన్
👉 ఇన్స్ట్రుమెంటేషన్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. - మెకానికల్ ఇంజినీరింగ్
👉 మెకానికల్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ట్రేడ్ అప్రెంటిస్ :
- అటెండెంట్ (కెమికల్ ప్లాంట్)
👉 బి.ఎస్సి. (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. - బాయిలర్ అటెండెంట్
👉 ఇంటర్ (సైన్స్ తో) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. - ఎలక్ట్రిషియన్
👉 ఇంటర్ (సైన్స్ తో) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. - హార్టికల్చర్ అసిస్టెంట్
👉 ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. - ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ (కెమికల్ ప్లాంట్)
👉 బి.ఎస్సి. (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. - ల్యాబ్ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్)
👉 బి.ఎస్సి. (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. - మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (పథాలజీ)
👉 ఇంటర్ (సైన్స్ తో) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
🔥 దరఖాస్తు విధానం :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్న అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల కోసం అప్రెంటిస్ ఇండియా website లోనూ, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ , టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాల కొరకు NATS website లోనూ దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ఎంపిక విధానం :
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల విద్యార్హతలు యొక్క మార్కుల మెరిట్ ఆధారంగా యు ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసి , ఉద్యోగాల నియామకం చేపడతారు.
🔥 స్టైఫండ్ :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఎంపిక కాబడిన వారికి నెలకు 9000 రూపాయలు , టెక్నీషియన్ అప్రెంటిస్ట్ ఎంపిక కాబడిన వారికి నెలకు 8000 రూపాయలు , ట్రేడ్ అప్రెంటిస్ గా ఎంపిక కాబడిన వారికి నెలకు ₹7,000 లభిస్తాయి.
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 29/08/2025 ( ఉదయం 08:00 గంటల నుండి )
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 12/09/2025 ( సాయంత్రం 05 :00 గంటల వరకు )
👉 click here to apply trade apprentice
👉 click here to apply graduate apprentice and technician